పోరగాండ్లకు ఫ్యాషనైంది.. లవర్లతో పోవుడు.. మెసేజిలు పెట్టుడు!
చీరి చింతగ్గట్టాలే! విధాత: ఔ.. ఈ నడిమిట్ల పోరగాళ్లు మస్తు హుషారైర్రు.. తమ ఇష్టమచ్చినట్లు ఎగురుడు.. దునుకుడు.. నచ్చినాడ్ని దీస్కొచ్చి లగ్గం చేయమని తల్లిదండ్రులను అడుగుడు.. లేదంటే నకరాల్ జేషుడు.. ఆనక అది నిజమనుకుని తల్లిదండ్రులు ఆగమాగం అవ్వుడు.. అటు పోలీసులను, ప్రభుత్వాన్ని తిట్టుడు.. సోషల్ మీడియాలో పోష్టులు వెట్టుడు.. గిప్పుడు గిదే ఫ్యాషన్ లెక్క నడుస్తుండవట్టే.. ఈళ్ళ తెలిదండ్రుల పరేషాన్ జూషి పోలీసులు, సర్కార్.. ఆమూల ఈమూల వెతకబడితే గీ పొరగాళ్లేమో తీరిగ్గా సాయంత్రానికి వీడియోలు […]

చీరి చింతగ్గట్టాలే!
విధాత: ఔ.. ఈ నడిమిట్ల పోరగాళ్లు మస్తు హుషారైర్రు.. తమ ఇష్టమచ్చినట్లు ఎగురుడు.. దునుకుడు.. నచ్చినాడ్ని దీస్కొచ్చి లగ్గం చేయమని తల్లిదండ్రులను అడుగుడు.. లేదంటే నకరాల్ జేషుడు.. ఆనక అది నిజమనుకుని తల్లిదండ్రులు ఆగమాగం అవ్వుడు.. అటు పోలీసులను, ప్రభుత్వాన్ని తిట్టుడు.. సోషల్ మీడియాలో పోష్టులు వెట్టుడు.. గిప్పుడు గిదే ఫ్యాషన్ లెక్క నడుస్తుండవట్టే..
ఈళ్ళ తెలిదండ్రుల పరేషాన్ జూషి పోలీసులు, సర్కార్.. ఆమూల ఈమూల వెతకబడితే గీ పొరగాళ్లేమో తీరిగ్గా సాయంత్రానికి వీడియోలు విడుదలజేషుడు. మేం మంచిగున్నాం.. ఆ ఊళ్ళో ఉన్నాం.. ఇక్కడున్నాం.. మాగురించి వెతకబట్టకుర్రి.. శివార్లేమో..మమ్మల్ని క్షమించుర్రి అంటూ ఓ మెసేజ్.. వీడియో విడిషివెట్డుడు ఫ్యాషన్ అయింది.
ఆ నడిమిట్ల విశాఖపట్నంలో మొగుడితో బాటు బీచ్‌కు షికారు వోయిన ఓ అమ్మి. జస్ట్ మొగుణ్ణి అలా సీకట్లోకి నడిపించి అలా లవర్‌తో గాయబ్.. పాపం ఆ ఎడ్డి మొగుడు అగమాగమై పోలీసుల కాడికి పరుగెట్టిండు. విశాఖపట్నం పోలీసులు.. ఇంకా నేవీ వాళ్ళు సైతం రంగంలోకి దిగి రెండ్రోజులు వెతక బట్టినా పాపం గామె దొరకలేదు. రెండ్రోజులు దాటినంక తీరిగ్గా ఖుషీగా ఓ మెసేజ్ పంపవట్టి. నేను నా లవర్ తో నెల్లూరులో ఉంటి. నా గురించి మీరు గుబులు బడకుర్రి అంటూ మెసేజ్.
అప్పటికే పోలీసులు.. స్పీడు బోట్లు.. నేవీ హెలికాఫ్టర్, గజ ఈతగాళ్లకు సర్కారు ఏకంగా కోటి ఖర్చు వెట్టబడె. ఇప్పుడా కోటి ఖర్చు ఈమె ఇస్తదా.. ఆమె లవర్ ఇస్తాడా.. చెప్పుర్రి.. మరి ఇయ్యాల సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాడపల్లిలో సుత. తండ్రిని కొట్టి పొల్లను.. ఓ పోరడు ఎత్కపోయిండట.. అయ్యో.. బంగారు తెలంగాణ అంటే ఇదేనా.. ఆడకూతురికి రక్షణ లేదా అంటూ పోరాగాళ్లు ఫోన్లళ్ల ఇక సోషల్ మీడియాలో మెసేజిలు..పోష్టులు ఒత్తుడే ఒత్తుడు..
మళ్ళీ సాయంత్రానికి కథ సుఖాంతం. నేను నా లవర్ తో పోయిన్ను.. ఆడ్నే లగ్గం జేషుకున్ను.. అమ్మా.. బాపూ.. మీరు ఆగం గాకుర్రి అంటూ మళ్లా ముదురు డైలాగ్స్ చెప్పబడితిరి. ఆగంగాకుండా ఎట్లుంటరు.. మీరు ప్లాన్ వేసుకుని పోయిర్రని తెలీక పాపం.. అమ్మాబాపులు.. చుట్టాలు బంధువులు ఆగమైతిరి మరి.. వాళ్ళ ఇజ్జత్ తీసినారు కదా.. ఆగమైతిరి.. మీలాగా కూల్ గా ఉండుట అందరికి ఐతదా బిడ్డా.. మీ అసుంటోళ్లని సీరి సింతగ్గట్టాలె.. తగ్గేదే ల్యా..!