పిల్లలు పుట్టడం లేదని.. భార్య ప్రైవేటు భాగాలు కోసేశాడు..
Uttar Pradesh | పెళ్లి అయిన ప్రతి జంట పిల్లలను కనాలని కోరుకుంటారు. ఈ క్రమంలో కొందరు నెలలోపే గర్భం దాల్చితే.. ఇంకొందరు సంవత్సరాలైనా గర్భం దాల్చరు. ఈ విషయంలో ఒక్కో మహిళది ఒక్కో సమస్య. ఇక పిల్లలు పుట్టకపోతే అటు భర్త, ఇటు అత్తమామల వేధింపులు.. సమస్య మగాడి వైపు ఉన్నా కూడా మహిళవైపే నెట్టెస్తూ హింసిస్తుంటారు. అయితే పెళ్లయి ఆరేండ్లు అయినా పిల్లలు పుట్టడం లేదని.. ఓ భర్త తన భార్య ప్రయివేటు భాగాలను […]

Uttar Pradesh | పెళ్లి అయిన ప్రతి జంట పిల్లలను కనాలని కోరుకుంటారు. ఈ క్రమంలో కొందరు నెలలోపే గర్భం దాల్చితే.. ఇంకొందరు సంవత్సరాలైనా గర్భం దాల్చరు. ఈ విషయంలో ఒక్కో మహిళది ఒక్కో సమస్య. ఇక పిల్లలు పుట్టకపోతే అటు భర్త, ఇటు అత్తమామల వేధింపులు.. సమస్య మగాడి వైపు ఉన్నా కూడా మహిళవైపే నెట్టెస్తూ హింసిస్తుంటారు. అయితే పెళ్లయి ఆరేండ్లు అయినా పిల్లలు పుట్టడం లేదని.. ఓ భర్త తన భార్య ప్రయివేటు భాగాలను పదునైన ఆయుధంతో కోసేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. లక్నోకు చెందిన రవీంద్రకు ఆరేండ్ల క్రితం వివాహమైంది. కానీ ఆ దంపతులకు ఇప్పటికీ పిల్లలు పుట్టలేదు. ఈ విషయంలో ఇరువురి మధ్య చాలాసార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. భర్త వేధింపులు భరించలేక భార్య తన పుట్టింటికి వెళ్లింది. ఎనిమిది నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్యను ఒప్పించి, డిసెంబర్ 25న తన ఇంటికి తీసుకొచ్చాడు భర్త. అదే రోజు రాత్రి భర్త క్రూరంగా ప్రవర్తించాడు. పిల్లల కోసమని చెప్పి.. అసహజ శృంగారానికి బలవంతం చేశాడు. భార్య ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన రవీంద్ర.. పదునైన ఆయుధంతో ఆమె ప్రయివేటు భాగాలను కోసేశాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.