Madhya Pradesh | BJP సీనియర్‌ నేత దీపక్‌ జోషి కాంగ్రెస్‌లో చేరిక

Madhya Pradesh విధాత: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కైలాశ్‌ జోషీ కుమారుడు, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు దీపక్‌ జోషీ శనివారం నాడు కాంగ్రెస్‌లో చేరారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమలనాథ్‌ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీజేపీ తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన విమర్శించారు. I’ll defeat Shivraj Singh Chauhan if Party gives me tickets, Deepak Joshi after joining Congress. BJP leadership […]

Madhya Pradesh | BJP సీనియర్‌ నేత దీపక్‌ జోషి కాంగ్రెస్‌లో చేరిక

Madhya Pradesh

విధాత: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కైలాశ్‌ జోషీ కుమారుడు, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు దీపక్‌ జోషీ శనివారం నాడు కాంగ్రెస్‌లో చేరారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమలనాథ్‌ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీజేపీ తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన విమర్శించారు.

మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన జోషి గత దేవాస్‌ జిల్లాలోని హత్‌పిప్లియా నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు. జోషీపై గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి బీజేపీలో చేరారు.

ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో జోషీ తిరిగి అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతున్నది.