Madhya Pradesh | మూత్ర విసర్జన ఘటన… నిందితుణ్ని వదిలేయాలని గిరిజనుడి వినతి
Madhya Pradesh విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి చర్చ జరగుతుండగానే బాధితుడు దశ్మత్ రావత్ ఆశ్చర్యకర ప్రకటన చేశాడు. తనపై ఘటనకు పాల్పడిన పర్వేశ్ శుక్లాను విడుదల చేయాలని అతడు విజ్ఞప్తి చేశాడు. అతడు చేసింది పెద్ద తప్పే అయినప్పటికీ.. పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి జైలు నుంచి విడుదల చేయాలని అతడితో మాట్లాడిన విలేకర్లకు తెలిపాడు. 'ఏది ఏమైనప్పటికీ అతడు మా గ్రామ పురోహితుడు. అతడిని వెంటనే విడుదల చేయాలని మేమంతా […]

Madhya Pradesh
విధాత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి చర్చ జరగుతుండగానే బాధితుడు దశ్మత్ రావత్ ఆశ్చర్యకర ప్రకటన చేశాడు. తనపై ఘటనకు పాల్పడిన పర్వేశ్ శుక్లాను విడుదల చేయాలని అతడు విజ్ఞప్తి చేశాడు. అతడు చేసింది పెద్ద తప్పే అయినప్పటికీ.. పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి జైలు నుంచి విడుదల చేయాలని అతడితో మాట్లాడిన విలేకర్లకు తెలిపాడు.
‘ఏది ఏమైనప్పటికీ అతడు మా గ్రామ పురోహితుడు. అతడిని వెంటనే విడుదల చేయాలని మేమంతా డిమాండు చేస్తున్నాం’ పేర్కొన్నాడు. తనకు తన ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్న డిమాండ్ తప్పితే మరే విజ్ఞాపనా లేదని రావత్ వెల్లడించాడు. మధ్య ప్రదేశ్ సిధి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. గిరిజన వర్గానికి చెందిన రావత్‌పై నిందితుడు పర్వేశ్ శుక్లా మూత్ర విసర్జన చేస్తున్న వీడియో మంగళవారం వైరల్‌గా మారింది.
ఈ జుగుప్సాకర ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. దీంతో పోలీసులు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.n అంతే కాకుండా నిందితుడిని తన వద్దకు పిలిపించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నారు.
ఐదు లక్షల నష్టపరిహారంతో పాటు రావత్ ఇంటి నిర్మాణానికి రూ.1.5 లక్షలనూ అందజేశారు. అయితే నిందితుడి ఇంటిలో కొంత భాగాన్ని బుల్డోజర్‌తో కూల్చడాన్ని స్థానిక బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. దీనిని నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. నిందితుడు చేసింది ఘోర నేరమే అయినప్పటికీ కుటుంబ సభ్యులకు ఎందుకు శిక్ష పడాలని ప్రశ్నించాయి.