గద్వాల జేజమ్మకే బీజేపీ టికెట్..?

పాలమూరు పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి అభ్యర్థి ప్రకటన వెలువడక పోవడం తో ఆ పార్టీ క్యాడర్ అంతా అయోమయం లో ఉంది

  • Publish Date - March 11, 2024 / 08:29 AM IST

– పాలమూరు పార్లమెంట్ స్థానం లో అరుణ వైపే మొగ్గు చూపుతున్న అధిష్టానం

– అరుణ పోటీలో ఉంటేనే బీజేపీ గెలుపు సాధ్యమనే ధోరణి లో పార్టీ అధినాయకత్వo

– రెండో విడత సీట్ల కేటాయింపు లో అరుణ కు దక్కే ఛాన్స

– – ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన

– ప్రచారం లో ముందున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీ

– బీ ఆర్ ఎస్ లో టికెట్ దక్కించుకున్నా ప్రచారం చేయని సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి

– టికెట్ ప్రకటించక పోవడం తో బీజేపీ క్యాడర్ లో అయోమయం

– పోటీలో అరుణ ఉంటేనే విజయం తథ్యం అంటున్న పాలమూరు బీజేపీ క్యాడర్

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పాలమూరు పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి అభ్యర్థి ప్రకటన వెలువడక పోవడం తో ఆ పార్టీ క్యాడర్ అంతా అయోమయం లో ఉంది.బీజేపీ అధిష్టానం ప్రకటించిన మొదటి జాబితాలో పాలమూరు బరిలో నిలిచే అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసహనం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ స్థానంలో పోటీ చేసేందుకు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీసీ కార్డు తో టికెట్ పొందాలని బీజేపీ సీనియర్ నేత శాంతి కుమార్,ఇంతకాలం పార్టీని నమ్ముకున్న తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ టికెట్ కోసమే ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశానని, పార్లమెంట్ స్థానం టికెట్ తనకే ఇవ్వాలని అధిష్టానం ఎదుట పట్టుబడుతున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. వీరి ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతుందడం తో దీన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ స్థానం నుంచి పోటీ చేసే వారి పేరును మొదటి జాబితాలో చేర్చలేదనే సమాచారం వస్తోంది. ఈ స్థానంలో లో గట్టి పోటీ ఇచ్చే నేతను బరిలో దింపాలనే యోచన లో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సమీకరణాల ప్రకారం పార్టీ అధిష్టానం మాత్రం డీకే అరుణ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం తో బీజేపీ కూడా బలమైన అభ్యర్థి ని పోటీలో ఉంచాలనే అభిప్రాయం లో ఉంది. దీంతో అరుణ పోటీలో ఉంటేనే కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ అభ్యర్థులను ఢీకొనే సత్తా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీ లు ఓసీ అభ్యర్థులను బరిలో నిలపడం తో బీజేపీ కూడా అదే వర్గానికి చెందిన అభ్యర్థి ని పోటీలో ఉంచాలని చూస్తోంది. కానీ ఈ సెగ్మెంట్ లో జితేందర్ రెడ్డి కూడా అదే వర్గానికి చెందడం తో ఆయన అభ్యర్థిత్వనన్ని పరిశీలన లో ఉంచింది. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేసి భారీ మొత్తం లో ఓట్లు సాధించింది. ఇది దృష్టిలో పెట్టుకుంటే అరుణ కే టికెట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు అసెంబ్లీ స్థానంనుంచి బీజేపీ తరపున జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. జితేందర్ కోసమే అసెంబ్లీ టికెట్ త్యాగం చేసానని అందుకే ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని డీకే అరుణ బీజేపీ అధినేతల దృష్టికి తీసుకెళ్ళింది. అటు శాంతి కుమార్, ఇటు జితేందర్ రెడ్డి నితో బీజేపీ అధిష్టానం సంప్రదింపులు జరిపి ఇద్దరినీ ఒప్పించి డీకే అరుణ కు టికెట్ ఇవ్వాలనే యోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరికీ పార్టీ లో మంచి స్థానం ఉంటుందని నచ్చజెప్పి పార్టీ ప్రకటించిన అభ్యర్థి కి మద్దతుగా ఉండాలని కోరే అవకాశం ఉంది.పార్టీ క్యాడర్ కూడా అరుణ బరిలో ఉంటేనే బీజేపీ విజయం ఖాయమనే ధోరణిలో ఉంది. రెండో జాబితాలో తన పేరు ప్రకటన ఉంటుందనే ధోరణి లో అరుణ ఉంది. తనకే టికెట్ వస్తుందని ఇప్పటికీ పాలమూరు లో మీడియా సమావేశం లో ఆమె ప్రకటించారు.త్వరలో బీజేపీ రెండో జాబితా వస్తుందని, అందులో పాలమూరు పార్లమెంట్ టికెట్ ప్రకటించే అవకాశం ఉంటుందనే భావనలో పార్టీ క్యాడర్ ఉంది. మొదటి జాబితాలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం అభ్యర్థి ని ప్రకటించిన బీజేపీ రెండో జాబితాలో పాలమూరు సెగ్మెంట్ లో అభ్యర్థి ని ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి cwc సభ్యుడు వంశీచందర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ బరిలో ఉంటారు.బీజేపీ నుంచి అరుణ బరిలో ఉంటే ముఖ్యంగా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.అరుణ బరిలో ఉంటే తాను జన్మించిన మక్తల్ నియోజకవర్గం తో పాటు ఇతర నియోజకవర్గాలు నారాయణ పేట,దేవరకద్ర, షాద్ నగర్, మహబూబ్ నగర్ తో పాటు జడ్చర్ల లో బీజేపీ బలంగా ఉంది. ఒక్క కొడంగల్ నియోజకవర్గం లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడం తో బీజేపీ వైపు ఓటర్లు మొగ్గుచూపుతారో లేదోనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభావం ఉంటే కొడంగల్ లో బీజేపీ కి పెద్దగా ఆదరణ లభించే అవకాశం తక్కువే.


కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి :

పాలమూరు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ మొదటి జాబితాలో చోటు దక్కించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఏఐసీసీ పెద్దల దీవెనలు వంశీ కి మెండుగా ఉండడం తో ఆయన కు మొదటి లిస్ట్ లో చోటు లభించింది. ఈ సెగ్మెంట్ లో ఇదివరకే న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర చేసి అన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. పాలమూరు పార్లమెంట్ స్థానం లో గెలుపు తథ్యం అనే ధోరణిలో ఆయన ఉన్నారు. ఈ స్థానం లో ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే లు ఉన్నారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, జడ్చర్ల, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారనే ధోరణి లో వంశీ చందర్ రెడ్డి ఉన్నారు.కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పై వ్యతిరేకంతో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉంటారా లేదా మోడీ చరిష్మా తో బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేక పోలేదు.


బీఆర్ ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి :

బీ ఆర్ ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ బరిలో రెండోసారి ఉంటున్నారు. ఈ సెగ్మెంట్ లో ఆయన మొదటి సారి విజయం సాధించినా నియోజకవర్గం లో ఆయన పేరు ఇప్పటికి చా మందికి తెలియదు. ఈ ఇదేళ్ల కాలం లో ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ వైపు కన్నెతైనా చూడలేదనే విమర్శలు ఉన్నాయి. అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పక్కన ఉండడం తప్పా ఎంపీ గా ఆయన చేసిందేమిలేదనే అపవాదు మూటగట్టు కున్నారు. ఇప్పటికి నియోజకవర్గం లో తన సొంత క్యాడర్ లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గెలుపు కష్టమే అని పార్టీ శ్రేణులే అంటున్నారు. ఈ ఐదేళ్లు పాలమూరు ఎంపీ ఎవరు అంటే తెలియని వారు కోకొల్లలు. ఇలాంటి నాయకునికి మళ్ళీ బీ ఆర్ ఎస్ టికెట్ ఇవ్వడం చూస్తే ఓటమి గ్యారంటీ అని తెలుస్తోంది. ఈ స్థానంలో బీ ఆర్ ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడం తో దిక్కులేక పార్టీ అధిష్టానం మళ్ళీ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి కి టికెట్ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పాలమూరు లో బీ ఆర్ ఎస్ పార్టీ ముక్కలు ముక్కలు గా మారిపోయింది. ఇక్కడ ఎలా విజయం సాధిస్తామని అనుకుంటున్నారో ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు.