Mahabubnagar | ఆదుకున్నాం ..ఆదరించండి మంత్రి శ్రీనివాస్ గౌడ్

Mahabubnagar విధాత ప్రతినిధి, ఉమ్మడి మహబూబ్ నగర్: సంక్షేమ పథకాలు అందించి పేదలను ఆదుకున్నామని, ఇల్లు లేని వారికి డబుల్ బెదురూమ్ ఇల్లు ఇచ్చి గూడు కల్పిoచామని, వీఆర్ఏ లను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత ఇచ్చామని రాష్ట్ర పర్యాటక, సాoస్కృతిక, ఎక్సయిజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి […]

Mahabubnagar | ఆదుకున్నాం ..ఆదరించండి మంత్రి  శ్రీనివాస్ గౌడ్

Mahabubnagar

విధాత ప్రతినిధి, ఉమ్మడి మహబూబ్ నగర్: సంక్షేమ పథకాలు అందించి పేదలను ఆదుకున్నామని, ఇల్లు లేని వారికి డబుల్ బెదురూమ్ ఇల్లు ఇచ్చి గూడు కల్పిoచామని, వీఆర్ఏ లను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత ఇచ్చామని రాష్ట్ర పర్యాటక, సాoస్కృతిక, ఎక్సయిజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి ప్రసంగించారు.

పేదలను ఆదుకున్న ఒకే ఒక ప్రభుత్వం బీఆరెస్ అని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత ఈ ప్రభుత్వందేనన్నారు. అందరిని ఆదుకున్న బీఆరెస్‌ను ప్రజలు ఆదరించాలని మంత్రి కోరారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో మంత్రి పర్యటించారు. భావశార్ క్షత్రియ సమాజం కోసం నిర్మించే కమ్యూనిటీ భవనం కోసం రూ. 30 లక్షల ప్రొసీడింగ్ మంత్రి అందజేశారు.

టీడీ గుట్ట ప్రాంతంలో పోచమ్మ గుడి నిర్మాణానికి రూ.10లక్షల ప్రొసీడింగ్ ను ఆలయ నిర్వాహకులకు అందించారు. తిరుమల హిల్స్ నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు రూ 1.77 కోట్ల ఖర్చుతో వేసే బీటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 2 వ వార్డు లో రూ.74లక్షలతో బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక శిల్పరామం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో 500 వీఆర్ఏలకు పోస్టింగ్ ఆర్డర్ లు అందజేశారు.

ఈ కార్యక్రమం లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సిహుo లు, కలెక్టర్ రవి ఇతర అధికారులు పాల్గొన్నారు.