Maharashtra | పేలిన పెట్రోల్ ట్యాంకర్.. నలుగురు సజీవదహనం
Maharashtra | విధాత: మహారాష్ట్ర (Maharashtra) లోని పుణె - ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవదహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ వారిని చికిత్స […]

Maharashtra |
విధాత: మహారాష్ట్ర (Maharashtra) లోని పుణె – ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవదహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం కారణంగా ముంబై – పుణె ప్రధాన రహదారిపై 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రమాదం జరిగిన స్థలం నుంచి 15 నుంచి 16 మీటర్ల వరకు మంటలు వ్యాపించాయి. ఇక పెట్రోల్ రహదారిపై ఏరులై పారింది. వేగంగా వచ్చిన ఓ బైక్ అదుపుతప్పింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.