మీ ఇంటి ఆడపడుచుగా నన్ను గెలిపించండి: పాల్వాయి స్రవంతి

విధాత, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మతతత్వ బీజేపీని ఓడించాలని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్ పడిందన్నారు. అవినీతి సొమ్ముతో అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా […]

మీ ఇంటి ఆడపడుచుగా నన్ను గెలిపించండి: పాల్వాయి స్రవంతి

విధాత, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మతతత్వ బీజేపీని ఓడించాలని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్ పడిందన్నారు.

అవినీతి సొమ్ముతో అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే కేసీఆర్ కుటుంబానికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం బాగుపడలేదన్నారు. కాంట్రాక్టు పనులకోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారన్నారు.

గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మకంతో గెలిపిస్తే ఆ నమ్మకాన్ని బీజేపీకి ఆయన అమ్ముకున్నాడన్నారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ అని, మీ ఇంటి ఆడపడుచుగా ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పై ఉందన్నారు. మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, వంశీకృష్ణ, నాయకులు మల్ రెడ్డి రామ్ రెడ్డి,హనుమంత్ రెడ్డి, చలమల కృష్ణారెడ్డి, మంచుకొండ సంజయ్, పన్నాల లింగయ్య. కారింగు రామ్మూర్తి కురుపాటి గణేశ్ కార్యకర్తలు పాల్గొన్నారు.