విధాత, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. శ్రీ మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించాడు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో ఊరేగుతున్నారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న […]
విధాత, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు.
శ్రీ మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించాడు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో ఊరేగుతున్నారు.
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే.
అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగుతున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.