Mamata Banerjee | అలా అయితే కాంగ్రెస్‌తో క‌లువం.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ హెచ్చ‌రిక‌

Mamata Banerjee బెంగాల్‌లో సీపీఎంతో క‌లిస్తే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి సాగలేం విధాత‌: వ‌చ్చే 2023-24 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన‌ బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ నెల 23న పాట్నాలో విప‌క్ష పార్టీల‌ భేటీ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు మొద‌టి వార్నింగ్ వ‌చ్చింది. ప‌శ్చిమ బెంగాల్‌లో సీపీఎంతో కాంగ్రెస్ జ‌త క‌లిస్తే.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో హ‌స్తం పార్టీకి త‌మ రాష్ట్రం నుంచి ఎలాంటి స‌హకారం అందించ‌బోమ‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ […]

  • By: krs    latest    Jun 17, 2023 6:47 AM IST
Mamata Banerjee | అలా అయితే కాంగ్రెస్‌తో క‌లువం.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ హెచ్చ‌రిక‌

Mamata Banerjee

  • బెంగాల్‌లో సీపీఎంతో క‌లిస్తే
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి సాగలేం

విధాత‌: వ‌చ్చే 2023-24 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన‌ బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ నెల 23న పాట్నాలో విప‌క్ష పార్టీల‌ భేటీ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు మొద‌టి వార్నింగ్ వ‌చ్చింది. ప‌శ్చిమ బెంగాల్‌లో సీపీఎంతో కాంగ్రెస్ జ‌త క‌లిస్తే.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో హ‌స్తం పార్టీకి త‌మ రాష్ట్రం నుంచి ఎలాంటి స‌హకారం అందించ‌బోమ‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ హెచ్చ‌రించారు.

మ‌మ‌తా బెన‌ర్జీ ఏమ‌న్నారంటే..

శుక్ర‌వారం కోల్‌క‌తా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భలో మ‌మ‌తా బెన‌ర్జీ మాట్లాడుతూ..@ కాంగ్రెస్ పార్టీ ప‌లు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న‌ది. బెంగాల్ లో సీపీఎంకు కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ది . బీజేపీకి ఆ రెండు పార్టీలు మిత్ర‌ప‌క్షాలు. పార్ల‌మెంట్‌లో ఆ రెండు మా మ‌ద్ద‌తు, స‌హకారం కోరుతున్నాయి. మేము ఇప్ప‌టికీ బీజేపీపై పోరాడుతూనే ఉన్నాం.

ఒక వేళ బెంగాల్‌లో సీపీఎంతో కూట‌మి క‌ట్టానికి కాంగ్రెస్ పార్టీ భావిస్తే.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మా వ‌ద్ద‌కు కాంగ్రెస్ పార్టీ రావ‌ద్దని హెచ్చ‌రించారు. ముందే హెచ్చ‌రించిన మ‌మ‌త‌ 2023-24 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏకంకావాల‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సీనియ‌ర్ నేత రాహుల్‌గాంధీ, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నిర్ణ‌యించారు.

ఈ నెల 23న‌ పాట్నాలో స‌మావేశ‌మై విప‌క్ష పార్టీల నేత‌లు, ముఖ్య‌మంత్రులు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించారు. బెంగాల్‌లో మాత్రంలో సీపీఎంతో కాంగ్రెస్ కూట‌మి క‌ట్ట‌కూడ‌ద‌ని ముందుగానే మ‌మ‌త స్ప‌ష్టంచేశారు.

బెంగాల్ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సీపీఎంతో క‌లిసిన కాంగ్రెస్

బెంగాల్‌లో ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా సీపీఎం, కాంగ్రెస్ క‌లిసి పోటీచేశాయి. ఆ ఎన్నిక‌ల్లో సీపీఎం 48,646 మందిని బ‌రిలోకి దించ‌గా, కాంగ్రెస్ 1,7750 మందిని పోటీలో నిలిపింది. బీజేపీ 56,321 మందిని నిలుప‌గా, సీపీఎం-కాంగ్రెస్ కూట‌మి అంత‌కు మించి అభ్య‌ర్థుల‌ను పోటీలో నిలిపింది.