Cobra | ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి.. కింగ్‌ కోబ్రా దాహార్తి తీర్చిన ప‌ర్యావ‌ర‌ణవేత్త‌

Cobra విధాత‌: నాగుపామును చూడ‌గానే శ‌రీరంలో వ‌ణుకు పుడుతోంది. కానీ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌ మాత్రం బెద‌ర‌లేదు. దాహాంతో అల్లాడిపోతున్న నాగుపాముకు ఓ డ‌బ్బాతో దాహార్తి తీర్చాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని క‌డ‌లూరు జిల్లా తిరుచ‌ప‌రూర్‌లోని ఓ ఇంటి వ‌ద్ద 10 నుంచి 12 అడుగుల పొడ‌వున్న నాగుపాము నిద్రాణంలో ఉంది. ఈ పామును ఆ ఇంటి య‌జ‌మాని న‌ట‌రాజ‌న్ గ‌మ‌నించాడు. Man gives water to cobra […]

Cobra | ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి.. కింగ్‌ కోబ్రా దాహార్తి తీర్చిన ప‌ర్యావ‌ర‌ణవేత్త‌

Cobra

విధాత‌: నాగుపామును చూడ‌గానే శ‌రీరంలో వ‌ణుకు పుడుతోంది. కానీ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌ మాత్రం బెద‌ర‌లేదు. దాహాంతో అల్లాడిపోతున్న నాగుపాముకు ఓ డ‌బ్బాతో దాహార్తి తీర్చాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని క‌డ‌లూరు జిల్లా తిరుచ‌ప‌రూర్‌లోని ఓ ఇంటి వ‌ద్ద 10 నుంచి 12 అడుగుల పొడ‌వున్న నాగుపాము నిద్రాణంలో ఉంది. ఈ పామును ఆ ఇంటి య‌జ‌మాని న‌ట‌రాజ‌న్ గ‌మ‌నించాడు.

దీంతో వెంట‌నే న‌ట‌రాజ‌న్ స్థానికంగా ఉండే ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త చెల్లాకు స‌మాచారం అందించాడు. అక్క‌డికి చేరుకున్న ప‌ర్యావ‌రణ‌వేత్త పామును ప‌రిశీలించాడు. అది డీహైడ్రేష‌న్‌కు గురైన‌ట్లు గుర్తించాడు. ఆ పామును ఎలాగైనా ప్రాణాల‌తో బ‌తికించాల‌నుకున్నాడు అత‌ను. దీంతో త‌న ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి.. ఓ ప్లాస్టిక్ డ‌బ్బాలో నీరు తీసుకొని.. దానికి దాహార్తి తీర్చాడు. నీరు తాగిన త‌ర్వాత పాములో క‌ద‌లిక వ‌చ్చింది. దాహార్తి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

అనంత‌రం నాగుపామును ఓ ప్లాస్టిక్ డ‌బ్బాలో ప‌ట్టి.. అడ‌విలో వ‌దిలిపెట్టాడు ఆ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌. విష‌పూరిత‌మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల్లే డీహైడ్రేష‌న్‌కు గురైన పాము అచేత‌నంగా ప‌డిఉండ‌వ‌చ్చ‌ని చెల్లా పేర్కొన్నాడు. త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పామును కాపాడిన చెల్లా సాహ‌సాన్ని సోష‌ల్ మీడియాలో పెద్ద‌సంఖ్య‌లో నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.