నేను సీఎం నియోజకవర్గం ఎంపీపీని.. నన్నేఆపుతావా!(VIDEO)
ట్రాఫిక్ పోలీసులతో ఓ వ్యక్తి దురుసు ప్రవర్తన విధాత: ఈ మధ్య అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అది ఎక్కడి దాకా వెళ్లిందంటే డ్యూటీలో ఉన్న పోలీసులను, అధికారులను కూడా బెదిరించే స్థితికి చేరుకున్నది. అలాంటి ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలు. అలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో జరిగింది. మేడ్చల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై కొంతమంది రాజకీయ నేతలు దురుసుగా ప్రవర్తించారు. నువ్వు ఏం చేస్తావ్.. నేను సీఎం నియోజకవర్గంలో […]

ట్రాఫిక్ పోలీసులతో ఓ వ్యక్తి దురుసు ప్రవర్తన
విధాత: ఈ మధ్య అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అది ఎక్కడి దాకా వెళ్లిందంటే డ్యూటీలో ఉన్న పోలీసులను, అధికారులను కూడా బెదిరించే స్థితికి చేరుకున్నది. అలాంటి ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలు. అలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో జరిగింది.
మేడ్చల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై కొంతమంది రాజకీయ నేతలు దురుసుగా ప్రవర్తించారు. నువ్వు ఏం చేస్తావ్.. నేను సీఎం నియోజకవర్గంలో ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులను బెదిరించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ఫోన్‌ను కూడా వారు గుంజుకున్నారు.
చివరికి అతను ఎంపీపీ కాదని, మనోహరాబాద్ ఎంపీపీ భర్త అని తేలింది. ఆయనతో పాటు పాటు మేడ్చల్ కౌన్సిలర్ చాపరాజు, రామాయపల్లి ఎంపీటీసీ మరిది శ్రీనివాస్ గౌడ్‌గా పోలీసులు తేల్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అధికారంలో ఉన్నాం.. అహంకారం ఉండకూడదు, అణకువుగా ఉండాలని సీఎం పార్టీ నేతలతో సమావేశమైన ప్రతిసారి బోధిస్తుంటారు. కానీ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సూచనలకు భిన్నంగా ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
నేను సీఎం నియోజకవర్గం ఎంపీపీని.. నన్నేఆపుతావా!(VIDEO) https://t.co/swkZdoPAgf pic.twitter.com/AcHIPDmG0v
— vidhaathanews (@vidhaathanews) December 24, 2022