బతికున్న కుక్కకు తాడు కట్టి.. బైక్‌పై ఈడ్చుకెళ్లారు.. వీడియో
మూగ జీవాల పట్ల ప్రేమగా ఉండాల్సిన మనషులు.. దారుణానికి పాల్పడ్డారు. ఓ బతికున్న కుక్కకు తాడు కట్టి.. బైక్‌పై వేగంగా వెళ్తూ ఆ కుక్కను ఈడ్చుకెళ్లారు

విధాత: మూగ జీవాల పట్ల ప్రేమగా ఉండాల్సిన మనషులు.. దారుణానికి పాల్పడ్డారు. ఓ బతికున్న కుక్కకు తాడు కట్టి.. బైక్‌పై వేగంగా వెళ్తూ ఆ కుక్కను ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పట్టపగలే నడిరోడ్డుపై ఓ కుక్కను ఓ వ్యక్తి బంధించాడు. ఆ కుక్క వెనుక కాళ్లకు తాడును కట్టాడు. అక్కడే ఉన్న బైక్‌ను మరో వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఇక కుక్కను తాడుతో కట్టిన వ్యక్తి.. బైక్ ఎక్కాడు. అనంతరం ఆ శునకాన్ని కాంక్రీట్ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో ఆ కుక్క తీవ్రంగా ఆయాస పడుతున్నట్లు కనిపించింది.
ఇక ఆ శునకాన్ని అలా ఈడ్చుకెళ్తుండగా.. మిగతా కుక్కలు వెంబడిపడ్డాయి. ఆవేదనతో ఆ శునకాలు మొరిగిన దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. అయితే ఆ కుక్కను ఎందుకు ఈడ్చుకెళ్లాల్సి వచ్చిందో తెలియరాలేదు. కుక్క పట్ల క్రూరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.