బైక్‌ను ఈడ్చుక్కెళ్లిన పోలీసు బస్సు.. మంటల్లో యువకుడు సజీవదహనం.. వీడియో
విధాత: బీహార్‌లోని చప్రా - శివన్ హైవేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ పోలీసు బస్సు.. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను ఢీకొట్టింది. అదే వేగంతో బస్సు.. బైక్‌తో పాటు ఓ యువకుడిని 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఇద్దరు యువకులు ఘటనాస్థలిలోనే పడిపోయారు. అయితే బైక్, బస్సు ఆయిల్ ట్యాంక్ మధ్య రాపిడి జరగడంతో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై బస్సు దిగేశారు. యువకుడు మాత్రం బస్సు కిందనే ఉన్నాడు. […]

విధాత: బీహార్‌లోని చప్రా – శివన్ హైవేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ పోలీసు బస్సు.. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను ఢీకొట్టింది. అదే వేగంతో బస్సు.. బైక్‌తో పాటు ఓ యువకుడిని 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఇద్దరు యువకులు ఘటనాస్థలిలోనే పడిపోయారు.
అయితే బైక్, బస్సు ఆయిల్ ట్యాంక్ మధ్య రాపిడి జరగడంతో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై బస్సు దిగేశారు. యువకుడు మాత్రం బస్సు కిందనే ఉన్నాడు. మంటల ధాటికి ఆ యువకుడు పూర్తిగా కాలిపోయాడు. బస్సుకు క్షణాల్లోనే మంటలు వ్యాపించి, పూర్తిగా కాలిపోయింది. మరో ఇద్దరు యువకులు కూడా మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పొలిటికల్ ఐకాన్ జయప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. అక్కడ బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసులు తిరిగి తమ ఏరియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.