Mancherial | కూతుర్ని ప్రేమించాడని.. బీర్‌లో విషమిచ్చి మేనల్లుడిని హతమార్చిన మామ
మానవత్వం మంట కలిసింది కూతుర్ని ప్రేమించాడని ఘూతకం మేనల్లుడికి బీర్‌లో విషమిచ్చి చంపిన మామ. విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల (Mancherial) జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతురును ప్రేమించాడని మేనమామ దారంగుల రాజమౌళి కత్తితో బెదిరించి బీర్ లో గడ్డిమందు కలిపి త్రాగించి హత్య చేశాడు. గడ్డి మందుతో బీరు తాగించిన విషయం ఎవరికైనా చెప్తే కుటుంబ సభ్యులను హతమారుస్తారని బెదిరించాడు. గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల […]

- మానవత్వం మంట కలిసింది
- కూతుర్ని ప్రేమించాడని ఘూతకం
- మేనల్లుడికి బీర్‌లో విషమిచ్చి చంపిన మామ.
విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల (Mancherial) జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతురును ప్రేమించాడని మేనమామ దారంగుల రాజమౌళి కత్తితో బెదిరించి బీర్ లో గడ్డిమందు కలిపి త్రాగించి హత్య చేశాడు. గడ్డి మందుతో బీరు తాగించిన విషయం ఎవరికైనా చెప్తే కుటుంబ సభ్యులను హతమారుస్తారని బెదిరించాడు.
గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్ (22) తన మేనమామ అయిన దారంగుల రాజమౌళి కూతురు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇది తెలిసిన అతని మేనమామ ఈనెల 14న మాట్లాడేది ఉంది రమ్మని చెప్పి లక్సెట్టిపేట మున్సిపాలిటీ శివారులోని మోదెల చెట్ల సమీపంలో కత్తితో బెదిరించి గడ్డిమందు కలిపిన బీర్ తాగించాడు.
అనిల్ స్పృహ తప్పగానే రాజమౌళి అక్కడి నుండి పరారయ్యాడు , స్పృహ కోల్పోయిన అనిల్ ను లక్షేపేట ఆస్పత్రి అక్కడి నుండి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంచడంతో కరీంనగర్ ఆసుపత్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మేనమామ చేసిన ఘాతుకాన్ని చెప్పాడు. అనిల్ చనిపోకముందు మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లక్షెట్టిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.