Madhya Pradesh | మావోయిస్టు దంపతుల అరెస్టు

అనారోగ్యంతో ఆసుపత్రికి.. సమాచారంతో ఏటీఎస్ దాడి Madhya Pradesh | విధాత బ్యూరో, కరీంనగర్: మావోయిస్టు పార్టీ అగ్రనేత‌ అశోక్ రెడ్డి అలియాస్ బల్దేవ్ (62), అతని భార్య రెమ్తి అలియాస్ కుమారి పొట్టాయ్ (43)లను జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరెస్టు చేశారు. ఈమేరకు మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) వర్గాలు తెలిపాయి. మావోయిస్టు దంపతులు చికిత్స కోసం జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వస్తున్నారనే సమాచారాన్ని ఏటీఎస్‌ బృందం అందుకుంది. ఈ క్రమంలో […]

  • Publish Date - August 27, 2023 / 09:20 AM IST
  • అనారోగ్యంతో ఆసుపత్రికి..
  • సమాచారంతో ఏటీఎస్ దాడి

Madhya Pradesh |

విధాత బ్యూరో, కరీంనగర్: మావోయిస్టు పార్టీ అగ్రనేత‌ అశోక్ రెడ్డి అలియాస్ బల్దేవ్ (62), అతని భార్య రెమ్తి అలియాస్ కుమారి పొట్టాయ్ (43)లను జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరెస్టు చేశారు. ఈమేరకు మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) వర్గాలు తెలిపాయి.

మావోయిస్టు దంపతులు చికిత్స కోసం జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వస్తున్నారనే సమాచారాన్ని ఏటీఎస్‌ బృందం అందుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఆస్పత్రిపై దాడి చేశారు. దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అశోక్ రెడ్డిపై 60కి పైగా కేసులు

తెలంగాణకు చెందిన అశోక్ రెడ్డి సీపీఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ కమిటీ జోన్ (డీకేజడ్‌సీ) సభ్యుడిగా ఉండగా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పరిధిలోని నారాయణపూర్ జిల్లాకు చెందిన అతని భార్య మావోయిస్టుల సంస్థ ప్రచార విభాగంలో పనిచేశారు.

అశోక్ రెడ్డిపై మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో 60కి పైగా కేసులు నమోదయ్యాయని, పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఏటీఎస్ సభ్యుడు చెప్పారు. వారి నుంచి పిస్టల్, కాట్రిడ్జ్‌లు, మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని, విచారణ కోసం భోపాల్‌కు తీసుకువస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

‘తక్షణమే కోర్టులో హాజరుపర్చాలి’

తీవ్ర అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు దంపతులకు తక్షణం వైద్య సహాయం అందించాలని పౌరహక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశాయి. తక్షణం కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశాయి.