బీహార్‌లో భారీగా అధికారుల బ‌దిలీలు

రాష్ట్రంలో ఓ వైపు రాజ‌కీయ గంద‌ర‌గోళం నెల‌కొని ఉండ‌గా మ‌రోవైపు బీహార్ ప్రభుత్వం పెద్ద సంఖ్య‌లో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది

బీహార్‌లో భారీగా అధికారుల బ‌దిలీలు
  • ఓవైపు రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ..
  • మ‌రోవైపు 22 మంది ఐఏఎస్‌, 79 మంది ఐపీఎస్‌,
  • 45 మంది బీహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బ‌దిలీ


విధాత‌: రాష్ట్రంలో ఓ వైపు రాజ‌కీయ గంద‌ర‌గోళం నెల‌కొని ఉండ‌గా మ‌రోవైపు బీహార్ ప్రభుత్వం పెద్ద సంఖ్య‌లో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది. శుక్ర‌వారం సీనియ‌ర్ అధికారుల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. బ‌దిలీ అయిన అధికారుల్లో 22 మంది ఐఏఎస్‌, 79 మంది ఐపీఎస్‌, 45 మంది బీఏఎస్, ఐదుగురు జిల్లా మేజిస్ట్రేట్‌లు (డీఎంలు), 17 మంది ఎస్పీలు ఉన్నారు.


సాధారణ పరిపాలనశాఖ నోటిఫికేషన్ ప్రకారం.. 2010 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి అయిన పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను ముఖ్యమంత్రి సచివాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఐజీ (జైళ్లు)గా ఉన్న 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శిర్సత్ కపిల్ అశోక్ నియమితులయ్యారు. హోంశాఖ నోటిఫికేషన్ ప్రకారం, వివిధ జిల్లాల్లో పోస్ట్ చేయబడిన 17 మంది ఎస్పీలతో సహా 79 మంది ఐపీఎస్ అధికారులను కూడా శుక్రవారం బదిలీ చేశారు. బీహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (బీఏఎస్)కు చెందిన 45 మంది అధికారులకు కూడా కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు.