BSPలో భారీగా చేరిన బీసీలు
బహుజన రాజ్యంలోనే పేదలకు న్యాయం డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విధాత, హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీలో బీసీలు భారీగా చేరుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుంచి మహిళలు, యువకులు భారీగా రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కరీంనగర్ నుంచి అధిక సంఖ్యలో బీసీ మహిళలు చేరారు. టీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు సంజయ్ పార్టీలో కూడా చేరారు. వందలాది […]

- బహుజన రాజ్యంలోనే పేదలకు న్యాయం
- డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
విధాత, హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీలో బీసీలు భారీగా చేరుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుంచి మహిళలు, యువకులు భారీగా రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
కరీంనగర్ నుంచి అధిక సంఖ్యలో బీసీ మహిళలు చేరారు. టీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు సంజయ్ పార్టీలో కూడా చేరారు. వందలాది మందికి కండువా కప్పి ప్రవీణ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

బహుజన్ సమాజ్ పార్టీ పేదల ఇళ్లల్లో పుట్టింది, పేదలకు న్యాయం చేసే ఏకైక పార్టీ అన్నారు. ఈ పార్టీ జెండా మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలంగాణ అమరవీరుల ఆశయాలను నెరవేర్చే పార్టీ అని తెలిపారు. మహనీయులైన ఫూలే, అంబేడ్కర్, నారాయణగురు, సాహుమహరాజ్, పెరియార్, కాన్షిరాంల ఆశయాల పునాదిగా నడుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మోసం చేసిందన్నారు.

మెజారిటీ ప్రజలను కూలీలుగా, శ్రామికులుగా మిగిల్చి వారు నాయకులుగా, ధనవంతులుగా మారారన్నారు. వారు కళ్లలో తిరుగుతూ కోట్లు సంపాదిస్తూ, మనల్ని కొడవల్లు పట్టి పనిచేసే కార్మికులను చేశారని, ఇంకెంతకాలం ఈ అవమానాన్ని భరించాలని ప్రశ్నించిన ఆయన మనమే అధికారంలోకి రావాలని, అందుకు ఏనుగు గుర్తుకు ఓటేయాలని కోరారు.

బీఎస్పి పది లక్షల ఉద్యోగాలు ఇస్తుందని, అందులో 5లక్షలు మహిళలకు ఇస్తుందని, పోడు, అసైన్డ్ భూములకు మహిళల పేరు మీద పట్టాలిచ్చే ఏకైక పార్టీ బీఎస్పి అని తెలిపారు. మహిళలకు సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, ఆత్మగౌరవంతో పనిచేసే అవకాశాలు కల్పించే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని స్పష్టం చేశారు. కుటుంబం నుండి ఒకరిని విదేశాల్లో చదివిస్తామని ప్రకటించారు.

ఊరూరా ఏనుగు గుర్తును పరిచయం చేయాలని, మాయావతి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన గొప్ప పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బహుజన రాజ్యంలోనే మన సంపద మనకు దక్కుతుందన్నారు. బీఎస్పి రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేస్తుందన్నారు. రంగారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు