కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు
విధాత: మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో శనివారం కాంగ్రెస్ మైనారిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆయాజ్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్‌లో చేరారు. మోత్కూరు పట్టణంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు నుంచి కర్నాటి రవి, గుండు రాజు, నర్సింహా, జిలానే, జుబేద, శోభ, భవాని,నర్సమ్మ వారితో పాటు సుమారు 500 మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై […]

విధాత: మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో శనివారం కాంగ్రెస్ మైనారిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆయాజ్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్‌లో చేరారు.
మోత్కూరు పట్టణంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు నుంచి కర్నాటి రవి, గుండు రాజు, నర్సింహా, జిలానే, జుబేద, శోభ, భవాని,నర్సమ్మ వారితో పాటు సుమారు 500 మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరినట్లుగా తెలిపారు.
వారికి మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ లు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి, జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.