111 జీవో నుంచి భూములు తొలగించి.. కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ జోన్లలోకి!

హెచ్‌ఎండీఏ పరిధిలో భారీగా రికార్డుల గోల్‌మాల్‌తో భూముల మార్పిడి జరిగినట్లుగా గుర్తించడం సంచలనంగా మారింది

111 జీవో నుంచి భూములు తొలగించి.. కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ జోన్లలోకి!
  • వందల కోట్ల భూములు పక్కదారి


విధాత: హెచ్‌ఎండీఏ పరిధిలో భారీగా రికార్డుల గోల్‌మాల్‌తో భూముల మార్పిడి జరిగినట్లుగా గుర్తించడం సంచలనంగా మారింది. 111 జీవో నుంచి భూములను తొలగించి కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్‌లలోకి మార్చినట్లుగా గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించి మరో హెచ్‌ఎండీఏ ప్లానింగ్ అధికారిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించాక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎండిఏ కమిషనర్ దాన కిషోర్ భావిస్తున్నారు.


మంగళవారం హెచ్‌ఎండీఏ భూముల సమీక్షా సమావేశంలో భూ మార్పిడి అక్రమాలు వెలుగుచూశాయి. భూములను మార్చిన హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారుపై దాన కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయం తర్వాత మరో హెచ్ఎండిఏ డైరెక్టర్ పై చర్యలకు సిద్ధమవుతున్నారు. వట్టినాగులపల్లిలో వందల కోట్ల విలువైన భూములను 111 జీవో నుంచి తొలగించి కమర్షిల్‌య, రెసిడెన్షియల్ జోన్‌లలోకి అక్రమంగా మార్చినట్లుగా సమీక్షలో బయపడింది.