సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు

సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

విధాత : సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. విజయలక్ష్మికి రేవంత్‌రెడ్డి, మున్షీలు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే యశస్వీరెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


అంతకుముందు ఇటీవల బీఆరెస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కూడా దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కేశవరావు, కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌లు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.