Medak | హిందువులను అవమానిస్తున్న సీఎం కేసీఆర్‌: కిషన్‌రెడ్డి

Medak | గజ్వెల్ లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి పర్యటన విధాత, మెదక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ఏక పక్ష రాజకీయ విధానాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తు అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల గజ్వెల్ పట్టణంలో జరిగిన మత ఘర్షణ లలో జైల్ కు వెళ్లిన వారిలో గజ్వెల్ పట్టణ వార్డ్ కౌన్సిలర్ గంగి శెట్టి రవి, బిజెపి నేత మనోహర్ యాదవ్ లను కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే […]

Medak | హిందువులను అవమానిస్తున్న సీఎం కేసీఆర్‌: కిషన్‌రెడ్డి

Medak |

  • గజ్వెల్ లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి పర్యటన

విధాత, మెదక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ఏక పక్ష రాజకీయ విధానాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తు అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల గజ్వెల్ పట్టణంలో జరిగిన మత ఘర్షణ లలో జైల్ కు వెళ్లిన వారిలో గజ్వెల్ పట్టణ వార్డ్ కౌన్సిలర్ గంగి శెట్టి రవి, బిజెపి నేత మనోహర్ యాదవ్ లను కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావులు పరమార్శించారు.

అంతకుముందు పట్టణంలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో హిందూ సమాజం తలదించుకునే విధంగా, ఇటీవల పట్టణంలో శివాజీ విగ్రహాన్ని అవమాన పరచడం సమంజసం కాదని, బీజేపీ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని శిక్షించకుండా హిందువులను మాత్రమే జైలుకు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం హిందూ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తున్నామ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ భూ కబ్జాలు, అక్రమ లిక్కర్ వ్యాపారాలు ప్రోత్సహించి, మహిళలను అవహేళన చేసిన ఎంతో మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్‌లో ఉన్నారని, వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ సమాజాన్ని అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్న అధికార పార్టీ నాయకులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. నిజాం వారసులుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. గజ్వేల్ గడ్డ మీద నుండి సవాల్ చేస్తున్నానని, దమ్ముంటే మీ పార్టీలో ఉన్న అవినీతి నాయకులపై కేసులు పెట్టి అమాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.