MEDAK | వర్షంలో హోరెత్తిన జర్నలిస్టుల నిరసన ర్యాలీ.. అల్లాదుర్గం హైవేపై రాస్తారోకో ధర్నా

MEDAK | వర్షంలో హోరెత్తిన జర్నలిస్టుల నిరసన ర్యాలీ.. అల్లాదుర్గం హైవేపై రాస్తారోకో ధర్నా
  • సాక్షి జర్నలిస్టు వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్
  • ఎమ్మెల్యే క్రాంతి స్పందించాలి
  • తహసీల్దార్ కు వినతి పత్రం

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తు టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ వర్షంలో హోరెత్తింది. గురువారం ఉదయం అల్లాదుర్గం ఐబి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు బారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లాదుర్గం హైవేపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ సతీష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా టీయూడబ్ల్యూజే-ఐజేయు జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ.. అల్లాదుర్గం సాక్షి రిపోర్టర్ వీరేందర్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఎంపీపీ అనీల్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్ట్ గా పనిచేసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో జర్నలిస్టుపై దాడిని ఖండించక పోవడం సిగ్గు చేటన్నారు. ఎంపీపీ అధ్యక్ష పదవిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సాక్షి జర్నలిస్టు వీరేందర్ పై అక్రమంగా బనాయించిన కేసు వెనక్కి తీసుకోవాలన్నారు. అవసరమైతే ఉద్యమాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ.. ఎంపిపి పై హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం స్పందించాలని కోరారు. దాడుల వ్యతిరేక కమిటీ రాష్ట్ర కమిటి సభ్యులు మిన్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యమాలకు టియూడబ్ల్యూజే నాయకత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు.

ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ఎంపీపీ అనిల్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐజెయూ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. రిపోర్టర్ వీరేందర్ పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, ఐజెయు సభ్యులు బుక్క అశోక్, కోశాధికారి దేవరాజ్, అందోల్ తాలూక అధ్యక్షులు భూమయ్య, రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లేశం, రేగోడ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శంకర్ గౌడ్, నారాయణ ఖేడ్ డివిజన్ అధ్యక్షులు అలీం, జోగిపేట యాదగిరి, వెంకట్ రెడ్డి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ రాజ్, జొన్నోజు రామాచారి, జిల్లా కార్యదర్శి ఆనంద్ కుమార్, నగేష్, రవి, లక్ష్మినారాయణ, పాపయ్య, సాక్షి జిల్లా ప్రతినిధి నీలం, బిక్షపతి, వందకు పైగా జర్నలిస్టులు తరలివచ్చారు.

హోరెత్తిన నినాదాలు

అల్లాదుర్గం ఐబీ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. హైవే పై రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. హోరు వర్షంలోను జర్నలిస్టుల కదలకుండా రాస్తారోకో చేశారు. రేగోడ్, పెద్ద శంకరంపేట్, టేక్మాల్, జోగిపేట, కౌడిపల్లి, రామాయంపేట తదితర మండలాల నుండి జర్నలిస్టులు తరలివచ్చారు.