Medak | మల్లన్నసాగర్ టు కామారెడ్డి.. కెనాల్‌ను సందర్శించిన స్పీకర్ పోచారం

Medak విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధి మంగోలు శివారులోని మల్లన్నసాగర్ నుంచి కామారెడ్డికి నీరు విడుదల చేసే కెనాల్‌ను శనివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పుష్పగుచ్ఛంతో మర్యాద పూర్వకంగా స్వాగతించారు. ఇరిగేషన్ అధికారులతో మల్లన్న సాగర్ నిర్మాణం గురించి మ్యాప్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ […]

Medak | మల్లన్నసాగర్ టు కామారెడ్డి.. కెనాల్‌ను సందర్శించిన స్పీకర్ పోచారం

Medak

విధాత, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధి మంగోలు శివారులోని మల్లన్నసాగర్ నుంచి కామారెడ్డికి నీరు విడుదల చేసే కెనాల్‌ను శనివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు.

జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పుష్పగుచ్ఛంతో మర్యాద పూర్వకంగా స్వాగతించారు. ఇరిగేషన్ అధికారులతో మల్లన్న సాగర్ నిర్మాణం గురించి మ్యాప్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.

స్పీకర్ వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎప్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.