మెదక్ వెస్లీ ఇంటర్మీడియట్ కళాశాల సీజ్

ఫీజుల కోసం వేధించిన యాజమాన్యం కాలేజీ ఎదుట ABVP విద్యార్థుల ధర్నా.. స్పందించిన ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కళాశాల సీజ్‌ ఇతర కళాశాలలకు విద్యార్థులు షిఫ్ట్ విధాత, మెదక్ బ్యూరో: మెదక్ వెస్లీ ఇంటర్మీడియట్ కళాశాలను ఇంటర్మీడియట్ జిల్లా అధికారి (DIEO) సత్యనారాయణ సీజ్ చేశారు. ఫీజుల కోసం నిత్యం వేధిస్తున్నారని.. అడ్మిషన్ సమయంలో ఫ్రీగా అడ్మిషన్ ఇస్తామని చెప్పి. ఇప్పుడు 10 వెలు ఆడుతున్నారని విద్యార్థులు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో […]

  • By: krs    latest    Jan 13, 2023 3:51 AM IST
మెదక్ వెస్లీ ఇంటర్మీడియట్ కళాశాల సీజ్
  • ఫీజుల కోసం వేధించిన యాజమాన్యం
  • కాలేజీ ఎదుట ABVP విద్యార్థుల ధర్నా..
  • స్పందించిన ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కళాశాల సీజ్‌
  • ఇతర కళాశాలలకు విద్యార్థులు షిఫ్ట్

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ వెస్లీ ఇంటర్మీడియట్ కళాశాలను ఇంటర్మీడియట్ జిల్లా అధికారి (DIEO) సత్యనారాయణ సీజ్ చేశారు. ఫీజుల కోసం నిత్యం వేధిస్తున్నారని.. అడ్మిషన్ సమయంలో ఫ్రీగా అడ్మిషన్ ఇస్తామని చెప్పి. ఇప్పుడు 10 వెలు ఆడుతున్నారని విద్యార్థులు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన ఆయన కళాశాల ప్రిన్సిపాల్ చంద్రపాక్ సమక్షంలోనే విచారణ జరిపి కళాశాలను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా కళాశాలలో చదువుతున్న 12 మంది విద్యార్థినులను మెదక్ బాలికల కళాశాలకు, మరో 6 గురు విద్యార్థులను మెదక్ బాయ్స్ కళాశాలకు షిఫ్ట్ చేసినట్లు ఇంటర్ అధికారి తెలిపారు.

ఉదయం నుంచి కళాశాల ఎదుట ABVP ఆందోళన..

మెదక్ వెస్లీ కళాశాలలో విద్యార్థులను యాజమాన్యం వేధిస్తోందని, బలవంతపు ఫీజులు వసూలు చేస్తున్నారని, కళాశాలలో కనీస వసతులు లేవని వెంటనే కళాశాలను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ABVP మెదక్ జిల్లా కన్వీనర్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాను, నాయకులు హకీల్, గణేశ్, ప్రశాంత్, అనిల్ తదితరులు విద్యార్థులతో కలసి ఆందోళన చేపట్టారు.