longest Hair | ప్ర‌పంచంలో పొడ‌వైన జుట్టు.. గిన్నిస్‌ బుక్‌లోకెక్కిన యువ‌కుడు

longest Hair | విధాత‌: ప్ర‌పంచంలో పొడ‌వైన జుట్టు ఉన్న యువ‌కుడిగా భార‌త యువ‌కుడికి కీర్తి కిరీటం ల‌భించింది. ఈ మేర‌కు అత‌డి పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో కూడా న‌మోద‌వ‌డం విశేషం. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని గ్రేట‌ర్ నోయిడాకు చెందిన సిద‌క్‌దీప్ సింగ్ చాహ‌ల్ అత్యంత పొడ‌వైన జ‌ట్టున్న మ‌గ టీనేజ‌ర్‌గా రికార్డు సృష్టించాడు. 'మేము సిక్కు మ‌త‌స్థులం. అందువ‌ల్ల జుట్టు క్ష‌వ‌రం చేయకూడ‌దు. అంతే కాకుండా నేను ఈ జుట్టు ప‌ట్ల ఎక్కువ శ్ర‌ద్ధ […]

  • By: Somu    latest    Sep 21, 2023 12:05 PM IST
longest Hair | ప్ర‌పంచంలో పొడ‌వైన జుట్టు.. గిన్నిస్‌ బుక్‌లోకెక్కిన యువ‌కుడు

longest Hair |

విధాత‌: ప్ర‌పంచంలో పొడ‌వైన జుట్టు ఉన్న యువ‌కుడిగా భార‌త యువ‌కుడికి కీర్తి కిరీటం ల‌భించింది. ఈ మేర‌కు అత‌డి పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో కూడా న‌మోద‌వ‌డం విశేషం. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని గ్రేట‌ర్ నోయిడాకు చెందిన సిద‌క్‌దీప్ సింగ్ చాహ‌ల్ అత్యంత పొడ‌వైన జ‌ట్టున్న మ‌గ టీనేజ‌ర్‌గా రికార్డు సృష్టించాడు.

‘మేము సిక్కు మ‌త‌స్థులం. అందువ‌ల్ల జుట్టు క్ష‌వ‌రం చేయకూడ‌దు. అంతే కాకుండా నేను ఈ జుట్టు ప‌ట్ల ఎక్కువ శ్ర‌ద్ధ పెట్టేవాడిని. అందుకే ఇంత‌లా పెరిగింది. ఇందులో నా కృషితో పాటు మా కుటుంబ స‌భ్యుల క‌ష్టం కూడా ఉంది. చిన్న‌ప్ప‌టి నుంచి మా అమ్మ ఎంతో జాగ్ర‌త్త తీసుకునేవారు’ అని చాహ‌ల్ పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం ఇత‌డి జుట్టు పొడ‌వు 4 అడుగుల 9.5 అంగుళాల పొడ‌వు ఉండ‌టం విశేషం. చిన్న‌ప్పుడు క‌టింగ్ చేయించుకుంటాన‌ని ఎంతో ఏడ్చేవాడ‌ని.. పెద్దయ్యాక తానే జుట్టు ప‌ట్ల ఎంతో శ్ర‌ద్ధ వ‌హించి పెంచుకున్నాడ‌ని అత‌డి త‌ల్లి చెప్పారు.

‘కేశ సంర‌క్ష‌ణ కోసం అత‌డి దిన చ‌ర్య గురించి వివ‌రించారు. వారానికి రెండు సార్లు త‌ల‌ స్నానం చేయిస్తాం. ఆ స్నానానికి సుమారు గంట కేటాయిస్తాం. త‌ల‌స్నానం, ఆర‌బెట్ట‌డం, దువ్వ‌డం అన్నీ త‌ప్ప‌ని స‌రిగా చేయాల్సిందే. అందులో వాడికి నేనే ఎప్పుడూ సాయం చేస్తా’ అని చెప్పారు.

చాహ‌ల్ కుటుంబంలో చాలా మందికి పెద్ద జుట్టు ఉన్న‌ప్ప‌టికీ వారెవ‌రికీ గిన్నిస్ బుక్‌లో చోటు ద‌క్క‌లేదు. త‌న‌కు రికార్డుల్లో చోటు ద‌క్కించుకోవ‌డం చెప్ప‌లేనంత ఆనందాన్నిస్తోంద‌ని చాహ‌ల్ మురిసిపోతున్నాడు.

గిన్నిస్ రికార్డుల ప్ర‌కారం.. ఇంత‌కు ముందు ఈ రికార్డు 6 అడుగుల 6 అంగుళాల జుట్టు ఉన్న నీలాన్షి ప‌టేల్ అనే యువ‌తి పేరుపై ఉండేది. అయితే 2021లో త‌న జుట్టును క‌ట్ చేసేసి మ్యూజియంకు ఇచ్చేయ‌డం వ‌ల్ల సిద‌క్‌దీప్ సింగ్ చాహ‌ల్‌కు మార్గం సుగ‌మ‌మైంది.