నేడు హాలియాలో చిరంజీవి విశ్వంభర షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం విశ్వంభర మూవీ మేకింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి

విధాత : మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం విశ్వంభర మూవీ మేకింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే నేడు చిత్ర బృదం నల్గొండ జిల్లా హాలియాలోని పాలెం స్టేజి వద్ద ఉన్న వజ్ర తేజ రైస్ ఇండస్ట్రీస్‌లో షూటింగ్ పనులు జరగనున్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఆయనతోపాటు పలువురు సహాయ నటులు, చిత్ర బృదం హాలియాకు తరలి రానున్నట్లు యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. దీంతో హాలియా పరిసర ప్రాంత ప్రజలు, చిరంజీవి అభిమానులు మెగాస్టార్ ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!