మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి
విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. పరిశ్రమలోని వేర్‌హౌస్ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములోకి మారుస్తున్న క్రమంలో స్ట్రాటిక్ ఎనర్జీతో ప్లాష్ ఫైర్ రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన పరితోష్ మెహతా( 40), బీహార్ కు చెందిన రంజిత్ కుమార్(27), లోకేశ్వర రావు కాంట్రాక్టు […]

విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు కార్మికులు మృతిచెందారు.
పరిశ్రమలోని వేర్‌హౌస్ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములోకి మారుస్తున్న క్రమంలో స్ట్రాటిక్ ఎనర్జీతో ప్లాష్ ఫైర్ రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి వెల్లడించారు.
ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన పరితోష్ మెహతా( 40), బీహార్ కు చెందిన రంజిత్ కుమార్(27), లోకేశ్వర రావు కాంట్రాక్టు కార్మికుడు తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.