యూపీ, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనకాల ఎంఐఎం..?
బీజేపీ బీ టీమ్‌లే మోదీ బలగం, బలం… విధాత: గుజరాత్ ఎన్నికలకు ముందు గోద్రా నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఎంఐఎం అభ్యర్థి అససుద్దీన్ ఒవైసీకి రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతున్నది. ఆ లేఖలో గుజరాత్‌లో ఏఐ ఎంఐఎం పోటీ చేయవద్దని అభ్యర్థించారు. పోటీ చేసి బీజేపీ గెలుపునకు పరోక్షంగా కారకులై బీజపీ కి బీ టీమ్‌గా ఎంఐఎంను చేయొద్దని కోరారు. ఆ నేపథ్యంలోనే ఏఐ ఎంఐఎం నేతలు ఈ సారి గుజరాత్ రాష్ట్రంలో జరిగే […]

- బీజేపీ బీ టీమ్‌లే మోదీ బలగం, బలం…
విధాత: గుజరాత్ ఎన్నికలకు ముందు గోద్రా నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఎంఐఎం అభ్యర్థి అససుద్దీన్ ఒవైసీకి రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతున్నది. ఆ లేఖలో గుజరాత్‌లో ఏఐ ఎంఐఎం పోటీ చేయవద్దని అభ్యర్థించారు. పోటీ చేసి బీజేపీ గెలుపునకు పరోక్షంగా కారకులై బీజపీ కి బీ టీమ్‌గా ఎంఐఎంను చేయొద్దని కోరారు.
ఆ నేపథ్యంలోనే ఏఐ ఎంఐఎం నేతలు ఈ సారి గుజరాత్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయొద్దని, తద్వారా బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చొద్దని నిర్ణయించారు. ఆ క్రమంలోనే వారు మొదసాలో పోటీ చేయలేదు. మొదసా మున్సిపల్ కార్పొరేషన్‌లో 12 లో 9 మందిని ఏఐ ఎంఐఎం గెల్చుకున్నది. అయినా అక్కడ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయొద్దని నిర్ణయించటం గమనార్హం.
కానీ గోధ్రా కౌన్సిలర్ మాటను జాతీయ ఎంఐఎం నేత ఒవైసీ ఖాతరు చేయలేదు. గుజరాత్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చి విపక్షమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. పరోక్షంగా బీజేపీ గెలుపునకు కారణమైంది.
సరిగ్గా యూపీలో కూడా ఇదే జరిగిందనే విశ్లేషణలున్నాయి. యూపీలో యోగీ ఆదిత్య నాథ్ గెలుపునకు బీజేపీ కారణం కాదు, బీఎస్పీ, ఎంఐఎం అనే ఆరోపణలున్నాయి. కనీసం 70 ఎసెంబ్లీ స్థానాల్లో 500 నుంచి 2000 వేల ఓట్ల తేడాతో బీజేపీ గెలిచిన స్థితి ఉన్నది. ఈ స్థానాల్లో ఎంఐఎం, బీఎస్పీ పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీని గెలిపించారు. ఆ స్థానాల్లో విపక్ష పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ఆ మార్జిన్ ఓట్లతోనే ఓటమి చెంది ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైంది. అంటే యూపీలో బీజేపీ గెలుపునకు కారణం ఎంఐఎం, బీఎస్పీలేనని రాజకీయ విశ్లేషణలన్నీ తేల్చి చెప్పటం గమనించదగినది.
గత కొన్నేండ్లుగా ఎంఐఎం పై ముఖ్యంగా యూపీ ఎన్నికల తర్వాత అసదుద్దీన్ ఒవైసీ పాత్రపై అనేక అనుమానాలు ప్రచారాలు ప్రచారంలోకి వచ్చాయి. అవి ఒట్టి అనుమానాలు మాత్రమే కాదు, తగు రాజకీయ విశ్లేషణలు, శాస్త్రీయ గణాంకాలతో యూపీ ఎన్నికల్లో ఒవైసీ నిర్వహించిన పాత్రను అంచనా వేస్తూ… ఎంఐఎం బీజేపీ బీ టీమ్ అని తేల్చి చెప్పాయి.
దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా ముస్లిం వర్గాల ప్రతినిధిగా చెలామని అవుతున్న ఎంఐఎం ఈ మధ్య కాలంలోనే ఇతర రాష్ట్రాల్లో అడుగుపెడుతున్నది. దేశ వ్యాప్తంగా మైనారిటీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కోసమే దేశ వ్యాప్తం చేస్తున్నట్లు ఒవైసీ చెప్పుకొస్తున్నారు. కానీ.. వాస్తవంలో జరుగుతున్నది వేరని ఆ మైనారిటీ వర్గాలే చెప్తున్న స్థితి ఉన్నప్పుడు తప్పక ఆలోచించాల్సిందే.
కనిపించేదంతా నిజం కాదు. పైకి నిశ్చలంగా కనిపిస్తున్నది నిజంగా నిశ్చలంగా జఢంగా ఏమీ ఉండదు. అంతర్గత చలనాలు కలిగి విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణతో ఉనికిలో ఉంటుంది. ఇది గతి తర్కం. కానీ సమాజంలో విభిన్న శక్తులుగా, ఘర్షణపూరితంగా ఉన్నట్లు కనిపిస్తున్న శక్తుల మధ్య నిజంగానే ఘర్షణ ఉన్నదా అంటే.. లేదనే ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చెబుతన్నాయి. బీజేపీ, ఎంఐఎం విరుద్ధ రాజకీయ శక్తులుగా కనిపిస్తున్నదంతా బూటకమేనని చెప్పకనే చెప్తున్నాయి.