నార్మాక్స్ డైరెక్టర్లకు మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందన

విధాత: నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సంఘానికి నూతనంగా ఎన్నికయిన డైరెక్టర్లను మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు.ఇటీవల ఖాళీ అయిన నకిరేకల్, భోనగిరి, ఆలేరు నియోజకవర్గ పరిధిలోని డైరెక్టర్ల పదవులకు ఈ రోజు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఈ ఎన్నికల్లో ఆలేరు నుంచి రాంరెడ్డి(జాల,రాజపేట మండలం)భోనగిరి నుంచి కస్తూరి పాండు (బస్వాపురం) నకిరేకల్ నుంచి మందడి ప్రభాకర్ రెడ్డి (నిడాంపల్లి,రామన్నపేట)లు ఎన్నికయ్యారు. టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నార్మాక్స్ మాజీ చైర్మన్ […]

  • By: krs    latest    Sep 28, 2022 12:34 PM IST
నార్మాక్స్ డైరెక్టర్లకు మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందన

విధాత: నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సంఘానికి నూతనంగా ఎన్నికయిన డైరెక్టర్లను మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు.ఇటీవల ఖాళీ అయిన నకిరేకల్, భోనగిరి, ఆలేరు నియోజకవర్గ పరిధిలోని డైరెక్టర్ల పదవులకు ఈ రోజు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.

ఈ ఎన్నికల్లో ఆలేరు నుంచి రాంరెడ్డి(జాల,రాజపేట మండలం)భోనగిరి నుంచి కస్తూరి పాండు (బస్వాపురం) నకిరేకల్ నుంచి మందడి ప్రభాకర్ రెడ్డి (నిడాంపల్లి,రామన్నపేట)లు ఎన్నికయ్యారు.

టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నార్మాక్స్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డిలతో పాటు నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు, తాజా పాలక వర్గం మర్యాద పూర్వకంగా మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను మంత్రి అభినందించారు.