కూత పెట్టి.. కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
విధాత, వరంగల్: నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీబిజీగా గడిపే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం, వావిలాలలో శుక్రవారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను కబడ్డీ ఆడి ప్రారంభించారు. మూడురోజులు జరిగే పోటీల సందర్భంగా కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడారు. కబడ్డీ ఆటలోనూ, వాలీబాల్ ఆటలోనూ, ఫుట్బాల్ ఆటలోనూ కెప్టెన్ గా ఉన్నానని, ఆటలంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు ఆటలను ఆడాలని, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని […]

విధాత, వరంగల్: నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీబిజీగా గడిపే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం, వావిలాలలో శుక్రవారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను కబడ్డీ ఆడి ప్రారంభించారు.
మూడురోజులు జరిగే పోటీల సందర్భంగా కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడారు. కబడ్డీ ఆటలోనూ, వాలీబాల్ ఆటలోనూ, ఫుట్బాల్ ఆటలోనూ కెప్టెన్ గా ఉన్నానని, ఆటలంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు ఆటలను ఆడాలని, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని వారిలో స్ఫూర్తిని రగిలించారు.