పెద్దగట్టు జాతరపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
విధాత: సూర్యాపేట జిల్లాలోని తెలంగాణ రెండో అతిపెద్ద జాతర శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 5 తేది నుండి 9తేది వరకు)అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా యంత్రాంగంతో మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు హాజరయ్యే భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి భక్తులకు సౌకర్యాలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పాటిల్ […]

విధాత: సూర్యాపేట జిల్లాలోని తెలంగాణ రెండో అతిపెద్ద జాతర శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 5 తేది నుండి 9తేది వరకు)అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా యంత్రాంగంతో మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జాతరకు హాజరయ్యే భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి భక్తులకు సౌకర్యాలు అందించాలన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావుల, పెద్దగుట్ట చైర్మన్ కోడి సైదులు యాదవ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.