Minister KTR | ప్రతిపక్షాలకు ఈసారి సినిమా చూపిస్తాం: మంత్రి కేటీఆర్

Minister KTR | విధాత, హైదరాబాద్: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని, ఈ ఏడాదిలోనే వారికి సినిమా చూపిస్తామని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. దక్షిణ భారత దేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ (వీఎస్టీ-ఇందిరా పార్క్‌)ను మంత్రి శనివారం హైదరాబాద్ లో ప్రారంభించి మాట్లాడారు. ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది […]

Minister KTR | ప్రతిపక్షాలకు ఈసారి సినిమా చూపిస్తాం: మంత్రి కేటీఆర్

Minister KTR | విధాత, హైదరాబాద్: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని, ఈ ఏడాదిలోనే వారికి సినిమా చూపిస్తామని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. దక్షిణ భారత దేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ (వీఎస్టీ-ఇందిరా పార్క్‌)ను మంత్రి శనివారం హైదరాబాద్ లో ప్రారంభించి మాట్లాడారు.

ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వది అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి పేరును ఈ స్టీల్‌ బ్రిడ్జ్‌కు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు చెప్పారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని తెలిపారు.