మరోసారి.. డీజే స్టెప్పులతో ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి

  • By: Somu    latest    Sep 30, 2023 12:39 PM IST
మరోసారి.. డీజే స్టెప్పులతో ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి
  • వరల్డ్ హార్ట్‌డేలో స్టెప్పులు


విధాత, హైద‌రాబాద్‌ : మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలీతో వార్తల్లో నిలిచారు. ఈ దఫా డైలాగ్‌లతో కాకుండా డ్యాన్స్‌లతో అందరిని అలరించారు. మల్లారెడ్డి మల్టి స్పెషాల్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి ఆశోక్ వన్ మాల్ వద్ద నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మార్క్ చూపిస్తూ డీజే టిల్లు తదితర సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. తన కశాశాల అమ్మాయిలతో కలిసి వారితో సమానంగా హుషార్‌గా డ్యాన్స్ చేసి అందరిని ఉత్తేశపరిచారు.


ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తాను 70ఏళ్ల వయసులో రోజు వ్యాయమయం, యోగా చేస్తానని, పౌష్టికాహారం తీసుకుంటానన్నారు. ఐటీ ఉద్యోగులు, యువత స్ట్రెస్‌తో కూడిన ఉద్యోగాలలో ఉన్న వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా గుండెను జాగ్రత్తగా చూసుకోవాలని, ముందుగా ఆరోగ్యమే ఐశర్యం..ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్య ఉన్మోళ్లే నిజమైన ధనవంతులన్నారు.