ప్రధాని చాయ్ అమ్మి సీఎం, పీఎం అయ్యిండు.. ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ అమ్ముతున్నడు.. అసెంబ్లీలో మంత్రి మల్లారెడ్డి స్పీచ్‌.. నవ్వులే నవ్వులు..!

విధాత: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మల్లారెడ్డి తన ప్రసంగంతో నవ్వుల పువ్వులు పూచించాయి. ‘రామరాజ్యం గురించి విన్నాం, రాముడిని ఫొటోల్లో చూశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది. తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారు’ అంటూ ప్రశంసించారు. సభలో మల్లారెడ్డి మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు విరిశాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో […]

ప్రధాని చాయ్ అమ్మి సీఎం, పీఎం అయ్యిండు.. ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ అమ్ముతున్నడు.. అసెంబ్లీలో మంత్రి మల్లారెడ్డి స్పీచ్‌.. నవ్వులే నవ్వులు..!

విధాత: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మల్లారెడ్డి తన ప్రసంగంతో నవ్వుల పువ్వులు పూచించాయి. ‘రామరాజ్యం గురించి విన్నాం, రాముడిని ఫొటోల్లో చూశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది. తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారు’ అంటూ ప్రశంసించారు.

సభలో మల్లారెడ్డి మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు విరిశాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో యాదాద్రి, సచివాలయం, అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, కాళేశ్వరం, మిషన్‌ భగీరథ రూపంలో ఏడు అద్భుతాల్ని చూస్తున్నాం. 28 రాష్ట్రాల్లో కేటీఆర్‌లాంటి ఐటీ మంత్రి ఎక్కడైనా ఉన్నారా..? మొన్న దావోస్‌ వెళ్లి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. కేటీఆర్‌ 110 ఏళ్లు దీర్ఘాయుష్షుతో జీవించాలి’ అన్నారు.

కేంద్రం అసలు దొంగల్ని వదిలిపెట్టి తమపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. వైద్య కళాశాలలు స్థాపించి పేదలకు సేవలందించానని.. నాపై ఐటీ దాడులు జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఐదెకరాల్లో రాజ్ భవన్ తరహాలో ఇల్లు కట్టుకున్న ఎమ్మెల్యే ఈటల, బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి ఇండ్లపై ఐటీ దాడులు జరగాలని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

పేదలకు విద్యనందిస్తున్నందుకే తనపై ఐటీ దాడులు చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాయ్ అమ్మినట్లుగా ప్రజా ఆస్తులను విక్రయిస్తున్నారని, ఇప్పుడు సింగరేణిని కూడా అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, భారీ భవనాల నిర్మాణంతో కార్మికులకు తీరిక దొరకడం లేదని, కార్మికులకు చేయాల్సిన పని ఉందన్నారు.

పేరుకు కార్మిక శాఖకు నిధుల కొరత లేదని, కార్మిక శాఖకు పూర్తి స్థాయిలో నిధులు పేర్కొన్నారు. ‘నేను పాలు అమ్మిన.. పూలు అమ్మిన. కాలేజ్ పెట్టిన.. ఎంపీ అయిన.. ఎమ్మెల్యే అయినా.. సీఎం కేసీఆర్ దయతో మంత్రినయ్యా. నా లెక్క ప్రధాని చాయ్ అమ్మి సీఎం అయ్యిండు.. పీఎం అయ్యిండు.. ఇప్పుడు సింగరేణి అమ్ముతుండు.. చాయ్ అమ్మినట్టు పబ్లిక్ ప్రాపర్టీ అమ్ముతున్నారు.. తెలంగాణ ఉద్యమంలో చంద్రుడిలా.. ఇప్పుడు సూర్యుడు లా కేసీఆర్.. అప్పట్లో చల్లని చంద్రున్ని తట్టుకోలేదు.. ఇప్పుడు సూర్యున్ని తట్టుకుంటారా..? కేటీఆర్ తప్పక సీఎం అయితడు.. కేసీఆర్ పీఎం అయితరు’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.