Miryalaguda | రైల్వే, కోర్టు ఉద్యోగాల పేర చానల్ రిపోర్టర్ ఘ‌రానా మోసం.. రూ.42.50 లక్షల వసూలు

Miryalaguda డీఎస్పీని ఆశ్రయించిన‌ బాధితులు విధాత: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ చానల్ జిల్లా రిపోర్టర్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడిన సంఘటన శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు చూసింది. మిర్యాలగూడ, వేములపల్లి మండలాలకు చెందిన ఏడుగురు బాధితుల వద్ద సుమారు రూ.42.50 లక్షలు వసూలు చేసి బాధితులకు కుచ్చుటోపి పెట్టాడు. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన కోదాటి శ్రీనివాస్ ఓ చానల్లో జిల్లా రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. […]

Miryalaguda | రైల్వే, కోర్టు ఉద్యోగాల పేర చానల్ రిపోర్టర్ ఘ‌రానా మోసం.. రూ.42.50 లక్షల వసూలు

Miryalaguda

  • డీఎస్పీని ఆశ్రయించిన‌ బాధితులు

విధాత: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ చానల్ జిల్లా రిపోర్టర్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడిన సంఘటన శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు చూసింది. మిర్యాలగూడ, వేములపల్లి మండలాలకు చెందిన ఏడుగురు బాధితుల వద్ద సుమారు రూ.42.50 లక్షలు వసూలు చేసి బాధితులకు కుచ్చుటోపి పెట్టాడు.

వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన కోదాటి శ్రీనివాస్ ఓ చానల్లో జిల్లా రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. అతనికి తెలిసిన స్నేహితులు.. ఇతరుల వద్ద రైల్వే, జ్యూడిషిషల్ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. వేములపల్లి మండలం రావులపెంటకు చెందిన కందుల నాగిరెడ్డి అతని కుమారులకు వినయ్ రెడ్డి, విజయ్ సాగర్ రెడ్డిలకు రైల్వే శాఖలో C,D ఉద్యోగాలు ఇప్పిస్తామని 2017లో మూడు లక్షలు, 2020లో ఎనిమిది లక్షలు, 2021లో ఐదు లక్షలు.. మొత్తం 16 లక్షలు వసూలు చేశాడు.

రైల్వే శాఖ నుండి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి ఉద్యోగాలు వచ్చాయని నమ్మబలికి వారితో ఆయా రైల్వేస్టేషన్లో పనులు చేయించి రెండు నెలలపాటు బ్యాంకులలో జీతాలు జమ చేశాడు. దీనిని నమ్మిన మరికొందరు మిర్యాలగూడ పట్టణానికి జాటోవత్ శంకర్ నాయక్(ఒక లక్ష), వేములపల్లి మండలం మొలకపట్నానికి చెందిన బొడ్డు సందీప్ (11 లక్షలు), అదే గ్రామానికి చెందిన బొమ్మగాని జానకి రాములు వద్ద (ఒక లక్ష), చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపాడు చెందిన వీరమల్ల మహేష్(9.50 లక్షలు) తోపాటు మంగాపురానికి చెందిన జరిపోతుల జానకి రాములు వద్ద (3 లక్షలు) మొత్తంగా 25.50 లక్షలు వసూలు చేశాడు.

ఉద్యోగాలు నకిలీవని తేలడంతో అప్రమత్తమైన బాధితులు తాము ఇచ్చిన డబ్బులు వసూలు కోసం అతనిపై ఒత్తిడి చేశారు. వేములపల్లి పోలీస్ స్టేషన్లో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. డబ్బు తిరిగి ఇవ్వాలని పలుమార్లు ఒత్తిడి చేయగా తాను ఇవ్వలేనంటూ.. ఏం చేసుకుంటారో చేసుకోమంటూ బెదిరింపులకు దిగారు.

దీంతో గత్యంతరం లేక బాధితులు శనివారం డిఎస్పీని ఆశ్రయించారు. అంతకుముందు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన కోదాటి శ్రీను పై చట్టరీత చర్య తీసుకుని మా డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.