మహిళా రైతు చేతి ముద్ద తిన్న ఎమ్మెల్యే.. నిరాడంబరత చాటుకున్న అరూరి

విధాత, వరంగల్: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు కూలీలు నాట్లు వేసి, మధ్యాహ్న భోజనం చేస్తుండగా పలు కార్యక్రమాలలో పాల్గొని అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళా రైతు ఎమ్మెల్యేను తన కొడుకుగా భావించి తను తినే అన్నాన్ని ఎమ్మెల్యేకు ప్రేమగా తినిపించారు. దీంతో ఎమ్మెల్యే ఒక సామాన్య వ్యక్తిలా, కన్న కొడుకులా […]

  • By: krs    latest    Jan 07, 2023 9:25 AM IST
మహిళా రైతు చేతి ముద్ద తిన్న ఎమ్మెల్యే.. నిరాడంబరత చాటుకున్న అరూరి

విధాత, వరంగల్: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు కూలీలు నాట్లు వేసి, మధ్యాహ్న భోజనం చేస్తుండగా పలు కార్యక్రమాలలో పాల్గొని అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.

ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళా రైతు ఎమ్మెల్యేను తన కొడుకుగా భావించి తను తినే అన్నాన్ని ఎమ్మెల్యేకు ప్రేమగా తినిపించారు. దీంతో ఎమ్మెల్యే ఒక సామాన్య వ్యక్తిలా, కన్న కొడుకులా ఎలాంటి భేషజం లేకుండా ఆ తల్లి రైతు పెట్టిన ముద్దన్నం తిని సంతోషం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించడంతో మహిళా రైతు కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. పొలం పనులు ఏవిధంగా సాగుతున్నాయి, రైతు బంధు డబ్బులు వచ్చాయా, పెన్షన్ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.