మంత్రి పదవి మిస్సయినా ఇలా సెట్టయ్యారు .. కోలగట్లకు డిప్యూటీ స్పీకర్.!

ఉన్న‌మాట‌: ఎలాగైనా మంత్రివర్గంలో చేరాలని ఆశ పడిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకున్నారు. జగన్ కేబినెట్లో మొదటిసారి అవకాశం వస్తుందని వీరభద్రస్వామి ఆశించారు. 2014 ఎన్నికల సమయం నుంచి జగన్‌తో ప్రయాణిస్తున్న స్వామి పదవిని ఆశించారు. అయితే.. 2019లో ఆ అవకాశాన్ని అదే వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎగరేసుకుపోయారు. అంతేకాకుండా ఆయన విజయనగరం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే […]

  • By: Somu    latest    Sep 18, 2022 11:01 AM IST
మంత్రి పదవి మిస్సయినా ఇలా సెట్టయ్యారు .. కోలగట్లకు డిప్యూటీ స్పీకర్.!

ఉన్న‌మాట‌: ఎలాగైనా మంత్రివర్గంలో చేరాలని ఆశ పడిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకున్నారు. జగన్ కేబినెట్లో మొదటిసారి అవకాశం వస్తుందని వీరభద్రస్వామి ఆశించారు. 2014 ఎన్నికల సమయం నుంచి జగన్‌తో ప్రయాణిస్తున్న స్వామి పదవిని ఆశించారు.

అయితే.. 2019లో ఆ అవకాశాన్ని అదే వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎగరేసుకుపోయారు. అంతేకాకుండా ఆయన విజయనగరం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే మొన్నటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో వెల్లంపల్లిని తప్పించడంతో ఆ ఛాన్స్ తనకు వస్తుందని స్వామి భావించారు.

కానీ ఆ కోరిక నెరవేరలేదు. వాస్తవానికి వీరభద్ర స్వామికి విజయనగరం లో మంచి పట్టుంది. గతంలో 2004 లో ఏకంగా టీడీపీ పెద్ద తలకాయ అశోక్ గజపతి రాజు మీద స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది రికార్డ్ సృష్టించారు. ఆ తరువాత కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అయ్యారు. మళ్ళీ 2014లో అశోక్ గజపతిరాజు చేతిలో ఓడిపోయి 2019ఎన్నికల్లో అశోక్ మీద ప్రతీకారం తీర్చుకున్నారు.

2019లో అశోక్ కుమార్తె అదితి గజపతి టీడీపీ తరఫున పోటీ చేయగా ఆమెను వీరభద్రస్వామి ఓడించారు. అయితే ఈ తరుణంలో మంత్రి పదవి వస్తుందని భావించినా కోన రఘుపతి రాజీనామాతో ఏర్పడిన ఖాళీలో స్వామిని డిప్యూటీ స్పీకర్‌గా స్వామికి అవకాశం దక్కింది. పోన్లే..లేని బావకన్నా గుడ్డివావ నయం అనుకుని స్వామి కాంప్రమైజ్ అయ్యారు.