బీఆరెస్‌ది కాళేశ్వరం పరిస్థితే: ఎమ్మెల్యే కూనంనేని

తెలంగాణలో బీఆరెస్ పార్టీ భవిష్యత్తు కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కుంగిందో అలాంటి పరిస్థితిలోనే ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు

  • By: Somu    latest    Mar 04, 2024 10:14 AM IST
బీఆరెస్‌ది కాళేశ్వరం పరిస్థితే: ఎమ్మెల్యే కూనంనేని
  • సీపీఎంతో కలిసి సాగుతాం


విధాత : తెలంగాణలో బీఆరెస్ పార్టీ భవిష్యత్తు కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కుంగిందో అలాంటి పరిస్థితిలోనే ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆరెస్‌లో తెలంగాణ సెంటిమెంట్ లేదని, తెలంగాణలో కారు పార్టీ నిలబడటమే కష్టమేనన్నారు. సీపీఎంతో కలిసే తాము రాజకీయంగా ముందుకెలుతామన్నారు. కమ్యూనిస్టులు ఏకం కావాలని రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు.


ఖమ్మం మొదటి నుంచి కమ్యూనిస్టుల కంచుకోట అని.. తక్కువ ఓట్లు వచ్చాయని సీపీఎంను తక్కువ అంచనా వేయలేమన్నారు. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో స్నేహం కొనసాగుతుందని కూనంనేని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో వామపక్షాలు ఉంటేనే బలమని, పార్లమెంటు ఎన్నికల్లో వామపక్షాలకు ఒక్కో స్థానమైన ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్లగొండ, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్ స్థానాలను కావాలని అడిగినట్లు తెలిపారు. ప్రజాపంధా ఆధ్వర్యంలో విప్లవ పార్టీలు ఏకం కావడం శుభపరిణామన్నారు.