CM KCRను కలిసిన MLAలు లింగయ్య, సైదిరెడ్డి

విధాత: సీఎం కేసీఆర్ తో సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరుమర్తి నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులను సీఎం కేసీఆర్ కు వివరించారు. బ్రాహ్మణవెల్లెంల, ఉదయసముద్రం ప్రాజెక్ట్ పూర్తికి నిధులు మంజూరు చేయాలని కోరారు. చిరుమర్తి విజ్ఞప్తికి స్పందించిన కేసీఆర్ ప్రాజెక్ట్ పూర్తికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ భేటీలో నకిరేకల్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, సొంత పార్టీలో మాజీ ఎమ్మెల్యే వీరేశంతో […]

  • By: krs    latest    Jan 23, 2023 3:26 PM IST
CM KCRను కలిసిన MLAలు లింగయ్య, సైదిరెడ్డి

విధాత: సీఎం కేసీఆర్ తో సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరుమర్తి నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులను సీఎం కేసీఆర్ కు వివరించారు.
బ్రాహ్మణవెల్లెంల, ఉదయసముద్రం ప్రాజెక్ట్ పూర్తికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

చిరుమర్తి విజ్ఞప్తికి స్పందించిన కేసీఆర్ ప్రాజెక్ట్ పూర్తికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ భేటీలో నకిరేకల్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, సొంత పార్టీలో మాజీ ఎమ్మెల్యే వీరేశంతో సాగుతున్న పంచాయితీని కూడా చిరుమర్తి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉండవచ్చని గులాబీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కేసీఆర్‌ను క‌లిసిన‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతిభవన్ లో సోమవారం హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, పెండింగ్ పనులను సీఎం కేసీఆర్‌కు వివరించారు. అలాగే నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు కేటీఆర్ పర్యటన సందర్భంగా చేపట్టిన పనుల పూర్తికి నిధులను మంజూరు చేయాలని కోరారు.