MLC Kavitha | విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సోమవారం ఆమె కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావదారిద్ర్యం తప్ప మరొకటి కాదు అన్నారు. ఖర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదని దుయ్యబట్టారు.
Addressed media friends at Kamareddy along with Mla Sri Gampa Govardhan garu & BRS Kamareddy President Sri Mujeeb garu pic.twitter.com/Yi7TsXxkUh
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 28, 2023
రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం, ఆ సభకు అమిత్ షా రావడం.. హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుంది అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం పనిచేస్తున్నదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ కాంగ్రెస్ ఉచిత పథకాలను ఎత్తి వేసిందన్నారు. తెలంగాణలో ప్రారంభించిన రైతు బంధును కాపీ కొట్టి మోడీ ప్రభుత్వం 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి, 2.5 కోట్ల మందికే ఇస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.