America | స్టోర్‌లోకి చొరబడి నిమిషాల్లో రూ.85 లక్షల సరకుల్ని దోచేసిన ముఠా..
విధాత: అమెరికా (America) లో దోపిడీ ముఠా వీరంగం సృష్టించింది. హఠాత్తుగా వచ్చిన 50 మంది (Mob) .. డిపార్ట్‌మెంట్ స్టోర్ మొత్తాన్ని నిమిషాల్లో దోచుకుని ఉడాయించారు. ఈ ఘటన లాస్ఏంజెలెస్‌లోని నార్డ్‌స్టోం డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో చోటు చేసుకుంది. వీరు దొంగలించిన వస్తువుల విలువ సుమారు రూ.85 లక్షల వరకు ఉంటుందని అంచనా. హుడీ చొక్కాలు, మాస్క్‌లు పెట్టుకొచ్చిన ఈ ముఠా.. ఎలుబంట్లను నిలువరించే స్ప్రేలను ఉపయోగించి సెక్యూరిటీ సిబ్బందిని స్పృహ తప్పించారు. Um grupo de […]

విధాత: అమెరికా (America) లో దోపిడీ ముఠా వీరంగం సృష్టించింది. హఠాత్తుగా వచ్చిన 50 మంది (Mob) .. డిపార్ట్‌మెంట్ స్టోర్ మొత్తాన్ని నిమిషాల్లో దోచుకుని ఉడాయించారు. ఈ ఘటన లాస్ఏంజెలెస్‌లోని నార్డ్‌స్టోం డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో చోటు చేసుకుంది. వీరు దొంగలించిన వస్తువుల విలువ సుమారు రూ.85 లక్షల వరకు ఉంటుందని అంచనా. హుడీ చొక్కాలు, మాస్క్‌లు పెట్టుకొచ్చిన ఈ ముఠా.. ఎలుబంట్లను నిలువరించే స్ప్రేలను ఉపయోగించి సెక్యూరిటీ సిబ్బందిని స్పృహ తప్పించారు.
Um grupo de pelo menos 30 pessoas assaltou uma loja de luxo Nordstrom no WestField Topanga Shopping Center em Los Angeles, Califórnia, resultando num prejuízo estimado de quase 100 mil dólares. pic.twitter.com/jHXT6MMToN
— Mundo Vivo (@mundo__vivo) August 14, 2023
అనంతరం లోపలకి వెళ్లి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. రాడ్డులతో షోకేజ్‌లు బద్దలు కొట్టి బ్రాండెడ్ దుస్తులు, షూలు, బ్యాగ్‌లు ఇతర అలంకరణ సామగ్రిని దోచుకుపోయారు. వారు వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు అంతా హాలీవుడ్ సినిమాలా అనిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. వీరంతా కార్లలో ఘటనా స్థలానికి చేరుకున్నారని.. వాటిల్లో బీఎండబ్ల్యూ, లెక్సస్ బ్రాండ్ వాహనాలూ ఉన్నాయని పోలీసులు చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటన అమెరికా కాలమానం శనివారం సాయంత్రం ఈ ఘటన జరగగా సాయంత్రం వెలుగులోకి వచ్చింది.