‘మోడీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ’ అంటూ మరోసారి వెలిసిన ఫ్లెక్షీలు

విధాత: తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ విభజన హామీలు పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చాలని ఇప్పటికే అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించింది. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి లేదా దానికి సమానమైన పథకాన్ని రాష్ట్రానికి ప్రకటించాలని పదే పదే డిమాండ్‌ చేస్తున్నది. అలాగే రాష్ట్రానికి మెడికల్‌ […]

  • By: krs    latest    Nov 11, 2022 3:01 AM IST
‘మోడీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ’ అంటూ మరోసారి వెలిసిన ఫ్లెక్షీలు

విధాత: తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ విభజన హామీలు పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చాలని ఇప్పటికే అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించింది. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి లేదా దానికి సమానమైన పథకాన్ని రాష్ట్రానికి ప్రకటించాలని పదే పదే డిమాండ్‌ చేస్తున్నది. అలాగే రాష్ట్రానికి మెడికల్‌ కళాశాలలు, నవోదయ, ఐఐఎం లాంటి విద్యా సంస్థలను కేటాయించాలని కోరుతున్నది. బీజేపీ అధికారం లేని రాష్ట్రాలలో గవర్నర్లు పెత్తనం చేస్తున్నారని విపక్షాలు ఇప్పటికే మండి పడుతున్నాయి.

మోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలి. రాజ్‌భవన్‌ నుంచి మరో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని నాడు ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్రాల హక్కులను విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్‌ ఎనిమిదేళ్లుగా చేస్తున్నారు.

నీతిఆయోగ్‌ సిఫార్సు మేరకు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు నిధులుల కేటాంచాలని కోరతున్నారు. కొవిడ్‌ సంక్షోభం తర్వాత దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు భారంగా మారాయి.