జోనూలేదు.. ఎయిర్‌పోర్టూ లేదు.. మోడీ టూర్ ఏపీకి ఆశాభంగమే

విధాత: ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో మనకు.. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు బోలెడు లాభాలున్నాయ్.. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోనుకు శంకుస్థాపన చేస్తారు.. ఇంకా భోగాపురం ఎయిర్పోర్టుకు సైతం పునాది రాయి వేస్తారు.. దీంతో తమ ఇమేజి..మైలేజీ పెరుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకుల ఆశలు గల్లంతయ్యాయి. ఆ రెండు శంకుస్థాపనలూ ప్రధాని టూర్లో లేకపోవడంతో నాయకులు ఉస్సూరంటున్నారు.. పిల్ల చచ్చినా పురిటికంపు పోలేదు అన్నట్లుగా ఈ పర్యటనలో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు […]

  • By: krs    latest    Nov 10, 2022 2:58 AM IST
జోనూలేదు.. ఎయిర్‌పోర్టూ లేదు.. మోడీ టూర్ ఏపీకి ఆశాభంగమే

విధాత: ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో మనకు.. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు బోలెడు లాభాలున్నాయ్.. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోనుకు శంకుస్థాపన చేస్తారు.. ఇంకా భోగాపురం ఎయిర్పోర్టుకు సైతం పునాది రాయి వేస్తారు.. దీంతో తమ ఇమేజి..మైలేజీ పెరుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకుల ఆశలు గల్లంతయ్యాయి.

ఆ రెండు శంకుస్థాపనలూ ప్రధాని టూర్లో లేకపోవడంతో నాయకులు ఉస్సూరంటున్నారు.. పిల్ల చచ్చినా పురిటికంపు పోలేదు అన్నట్లుగా ఈ పర్యటనలో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు మినహా ఏపీకి పెద్దగా ఏమీ ఒరగకపోయినా వైసీపీ మాత్రం భారీగానే ఏర్పాట్లు చేస్తోంది. చుట్టుపక్కలున్న జిల్లాల నుంచి భారీగా బస్సుల్లో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు.. నాయకులు సమావేశం పెట్టుకుని ఈ ప్రధాని టూర్ ఏర్పాట్లను సమీక్షించుకున్నరు.

నిన్నటివరకూ అయితే రూ.120 కోట్లతో విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రైల్వే జోన్ కార్యాలయం కోసం శంకుస్థాపన చేస్తారు అని ప్రచారం సాగింది. తీరా ఇప్పుడేమో అలాంటిదేమి లేదని బిజెపి వర్గాలు అంటున్నాయి. ప్రధాని చేతుల మీదుగా ఈ జోనల్ ఆఫీస్‌కి శ్రీకారం చుడితే ఖచ్చితంగా జోన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. మాట తప్పడానికి వీల్లేదు. ఇది కాస్తా బీజేపీ మీద ఒత్తిడి పెంచుతుంది.

ఒకవేళ అది సకాలంలో కార్యరూపం దాల్చకుంటే తాము ప్రజల్లో చులకన అవుతామని భావించిన బీజేపీ మొత్తం ఈ ప్రోగ్రామును రద్దు చేయించింది అంటున్నారు. ఇదిలా ఉండగా భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో ఇంకా కోర్టు కేసులు పూర్తిగా తేలనందున ఆ ప్రోగ్రాంను ప్రధాని షెడ్యూల్లో చేర్చలేదని తెలుస్తోంది.

దీంతో ప్రధాని రాకతో ఈ పని కూడా జరగడం లేదు. పోనీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకు వెళ్లిపోతున్నా రైల్వే జోన్ అయినా వస్తే కొంత రిలీఫ్ అవుతుందని భావించినా అవేమి జరగడం లేదని ఇప్పుడు వైసీపీ మనసులో లోలోన కుమిలిపోతూనే బయటకు ఏమీ అనలేక ఏడుస్తూనే ఏర్పాట్లు చేస్తోంది.