నెల రోజుల పసికందుపై కోతి దాడి.. తలకు ఐదు కుట్లు
విధాత: ఓ కోతి చేసిన పనికి పసిబిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి చేతిలో ఉన్న పసిపాపను లాక్కెళ్లేందుకు కోతి యత్నించింది. దీంతో పాప తలకు ఐదు కుట్లు పడ్డాయి. ఈ ఘటన మహారాష్ట్ర థానే సిటీలోని షిల్ డైఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది. ఓ కేసు నిమిత్తం మహిళ తన నెల రోజుల ఆడ బిడ్డతో పోలీసు స్టేషన్‌కు వచ్చింది. పసిబిడ్డను అక్కడే ఉన్న ఓ కోతి గమనించింది. ఇక […]

విధాత: ఓ కోతి చేసిన పనికి పసిబిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి చేతిలో ఉన్న పసిపాపను లాక్కెళ్లేందుకు కోతి యత్నించింది. దీంతో పాప తలకు ఐదు కుట్లు పడ్డాయి. ఈ ఘటన మహారాష్ట్ర థానే సిటీలోని షిల్ డైఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది.
ఓ కేసు నిమిత్తం మహిళ తన నెల రోజుల ఆడ బిడ్డతో పోలీసు స్టేషన్‌కు వచ్చింది. పసిబిడ్డను అక్కడే ఉన్న ఓ కోతి గమనించింది. ఇక తల్లి నుంచి ఆ బిడ్డను లాక్కునే ప్రయత్నం చేసింది కోతి. ఒక్కసారిగా మహిళ ఒడిలో ఉన్న బిడ్డను లాక్కెళ్లేందుకు యత్నించగా, తల్లి అప్రమత్తమై బిడ్డను కాపాడుకుంది.
ఈ ఘటనలో పాప తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు పాపను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆ పసిబిడ్డ తలకు ఐదు కుట్లు వేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు కోతిని బంధించి, సమీప అడవుల్లో వదిలేశారు.