Telangana | కాసుల కోసం మరిన్ని ఎలైట్ బార్లు

మద్యం ద్వారా మరింత ఆదాయం పెంచుకునే దిశగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త ఆలోచనలకు తెరతీస్తుంది

Telangana | కాసుల కోసం మరిన్ని ఎలైట్ బార్లు
  • కసరత్తు చేస్తున్న ఎక్సైజ్ శాఖ

Telangana | విధాత: మద్యం ద్వారా మరింత ఆదాయం పెంచుకునే దిశగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త ఆలోచనలకు తెరతీస్తుంది. త్వరలో తెలంగాణలో మరిన్ని ఎలైట్ బార్లు, దుకాణాలకు అనుమతించే విషయమై కసరత్తు చేస్తుంది. అదనంగా 25 శాతం ఫీజును చెల్లిస్తే కొత్త ఎలైట్ బార్లు, దుకాణాలకు అనుమతివ్వాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తుంది.


ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, దాదాపు 1,200 బార్లు, క్లబ్లులు ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 30,000 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 140 ఎలైట్ బార్లు ఉండగా మరో 100 నుంచి 200ల వరకు ఎలైట్ బార్లకు అనుమతి ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. ఎలైట్ బార్లు, మద్యం దుకాణాలు ఏర్పాటుకు ఇప్పుడున్న రెగ్యులర్ లైసెన్స్ ఫీజు కంటే 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్న ఎక్సైజ్ శాఖ పేర్కోంది.