మల్లికార్జున్ ఖర్గేతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ!
విధాత: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలను కోమటిరెడ్డి ఈ సందర్భంగా ఖర్గేకు ఏకరువు పెట్టారు. మునుగోడు ఉప ఎన్నిక పరిస్థితులు.. రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలు, షోకాజ్ నోటీస్ వివాదం, రేవంత్ రెడ్డి పార్టీని నడిపిస్తున్న తీరుపై సీనియర్ల అసంతృప్తి, రాష్ట్ర కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన […]

విధాత: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలను కోమటిరెడ్డి ఈ సందర్భంగా ఖర్గేకు ఏకరువు పెట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక పరిస్థితులు.. రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలు, షోకాజ్ నోటీస్ వివాదం, రేవంత్ రెడ్డి పార్టీని నడిపిస్తున్న తీరుపై సీనియర్ల అసంతృప్తి, రాష్ట్ర కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన కార్యవర్గ, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో తనకు స్థానం కల్పించకపోవడం తదితర అంశాలను ఖర్గేకు కోమటిరెడ్డి వివరించారు.
ముఖ్యంగా సీనియర్లు ఒక్కొక్కరు పార్టీని వీడటం, శశిధర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం, తాజాగా ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీల పట్ల తలెత్తిన అసంతృప్తి, కమిటీల కూర్పుపై రేవంత్ కనీసం సిఎల్పీ నేత భట్టి ని కూడా సంప్రదించకపోవడం వంటి అంశాలపై ఆయన ఖర్గేతో చర్చించారు.
కోమటిరెడ్డితో భేటీ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ భవిష్యత్ లో ఆయనకు జాతీయ స్థాయి కమిటీలలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక పిదప కొంత కాలంగా కాంగ్రెస్ క్రియాశీలక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మల్లిఖార్జున్ ఖర్గే తో భేటీ కావడం పట్ల కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.