MP కోమటిరెడ్డిని సస్పెండ్‌ చేయాలి: కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్యలు

విధాత‌: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నార‌న్నారు. అయితే దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విషయాలు మాట్లాడవద్దని సురేఖకు సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రేవంత్‌ రెడ్డి కి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి […]

  • By: krs    latest    Jan 21, 2023 11:35 AM IST
MP కోమటిరెడ్డిని సస్పెండ్‌ చేయాలి: కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్యలు

విధాత‌: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నార‌న్నారు. అయితే దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విషయాలు మాట్లాడవద్దని సురేఖకు సూచించారు.

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రేవంత్‌ రెడ్డి కి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

చివరికి ఆయనపై రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది. రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వెంకట్‌ రెడ్డి పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్లీ నిన్న గాంధీ భవన్‌లో వెంకట్‌రెడ్డి, రేవంత్‌తో సమావేశమై తాజా రాజకీయాలపై చర్చించారు. ఉప్పు నిప్పులా ఉండే వాళ్లు నిన్న కలిసి మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అయితే ఒక్కరోజులోనే కొండా సురేఖ వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేయడం సంచలనంగా మారింది. వ్యక్తిగత విషయాలు మాట్లాడవద్దని రేవంత్‌ సురేఖకు సూచించడంతో అసలు ఆమె ఆయనపై ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు?

పార్టీ నేతలు అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడవద్దు అని మొన్ననే దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు. అయినా సురేఖ వెంకట్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలని కోరడం వెనుక ఏమై ఉంటుంది? కొండా దంపతులు కొంతకాలంగా పార్టీ మారుతారు అనే చర్చ జరుగుతున్నది. వాళ్లు బీజేపీలోకి వెళ్తారు అనుకుంటరున్నారు.

వెంకట్‌రెడ్డిపై విమర్శలు చేసి దానిని కారణంగా చూపి కాషాయ కండువా కప్పుకోవాలనుకుంటున్నారా? లేక ఆమె చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికమా అనేది చర్చించుకుంటున్నారు.