బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు.. పొత్తులో బీఆరెస్ నిర్ణయం

బీఎస్పీతో పొత్తులో భాగంగా బీఆరెస్ రెండు ఎంపీ స్థానాలను కేటాయించింది. నాగర్ కర్నూల్‌, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించగా, మిగతా 15ఎంపీ స్థానాల్లో బీఆరెస్ పోటీ చేయనుంది

బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు.. పొత్తులో బీఆరెస్ నిర్ణయం

విధాత, హైదరాబాద్ : బీఎస్పీతో పొత్తులో భాగంగా బీఆరెస్ రెండు ఎంపీ స్థానాలను కేటాయించింది. నాగర్ కర్నూల్‌, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించగా, మిగతా 15ఎంపీ స్థానాల్లో బీఆరెస్ పోటీ చేయనుంది. ఈ మేరకు బీఎస్పీ అధ్యక్షుడు ఆరెస్‌.ప్రవీణ్‌కుమార్‌, బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌లు పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నారు.


బీఎస్పీకి కేటాయించిన నాగర్ కర్నూల్ స్థానంలో ఆరెస్‌. ప్రవీణ్‌కుమార్ పోటీ చేయనున్నారు. హైదరాబాద్ బీఎస్పీ అభ్యర్థిని నిర్ణయించాల్సివుంది. ఇకపోతే బీఆరెస్ నుంచి ఇప్పటికే 11ఎంపీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. మెదక్‌, సికింద్రాబాద్‌, నల్లగొండ, భువనగిరి స్థానాల బీఆరెస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సివుంది.