గడ్డం తీయడంపై ఉత్తం కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్న నా మొక్కు రేపటీతో తీరబోతుందని, ఆదివారం నా గడ్డం తీయబోతున్నానని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ, హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు

విధాత : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్న నా మొక్కు రేపటీతో తీరబోతుందని, రేపు నా గడ్డం తీయబోతున్నానని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ, హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.
శనివారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాకు ఆశాజనకంగా ఉన్నా సంపూర్ణ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. దీనిపై ఫలితాల వెల్లడి తర్వాతా తాను మాట్లాడుతానన్నారు. క్యాంపు రాజకీయాల సమాచారం తనకు లేదని, ఆ అవసరం లేకుండా కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ దక్కుతుందన్నారు.